KTR Assembly

‘అదానీ-రేవంత్ భాయ్ భాయ్’ టీషర్ట్ తో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘అదానీ-రేవంత్ భాయ్ భాయ్’ అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. అయితే, ఈ టీషర్ట్స్ అసెంబ్లీ సముచిత వాతావరణానికి తగదని భవిస్తూ పోలీసులు, గేటు దగ్గర వారిని అడ్డగించారు. టీషర్ట్స్ తొలగించి లోపలికి వెళ్లాలని సూచించిన పోలీసులకు బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పార్టీ నాయకుడు కేటీఆర్ ఈ విషయం పై గట్టిగా స్పందించారు. ఈ విషయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్, ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛను కించపరచడం సరికాదని అభిప్రాయపడ్డారు.

దీంతో ‘అదానీ-రేవంత్ భాయ్ భాయ్’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా నినాదాలు చేశారు. ‘ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీనా?’ అంటూ ఎమ్మెల్యేలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్‌ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులకు జోహార్‌.. వీరులకు జోహార్‌ అంటూ పాటపాడారు.

హైదరాబాద్‌లో ఈరోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు మొదలవనున్న ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మొదటి రోజే ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టడం, రెండు నివేదికలు సమర్పించడంతో పాటు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరుకావడం విశేషం. విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర ప్రత్యేకతను ప్రదర్శించే పలువురు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

Related Posts
ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు: చంద్రబాబు
ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ Read more

రేషన్ కార్డులపై భట్టి కీలక ప్రకటన
Bhatti's key announcement on ration cards

రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు Read more

స్కూల్లో అగ్ని ప్రమాదం.. 17 మంది చిన్నారులు సజీవదహనం
fire in schook

నైజీరియాలో ఓ స్కూల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జంఫారా రాష్ట్రంలోని కైరా నమోదాలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో Read more

ఏపీ డిప్యూటీ సీఎం ను కలిసిన కాంగ్రెస్ నేత వీహెచ్
VH meets pawan kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు (వీహెచ్) మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో Read more