adani

అదానీకి స్టాలిన్ సర్కారు షాక్

ఇటీవల అదానీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఆయనకు షాక్ ఇచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి సంబంధించిన స్మార్ట్ మీటర్ల టెండర్ ను స్టాలిన్ సర్కారు రద్దు చేసింది. అదానీ గ్రూప్ కోట్ చేసిన ధర చాలా ఎక్కువని, ఆ ధర ఆమోదయోగ్యం కాదని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ కారణంగా పాత టెండర్లు రద్దు చేసి త్వరలో మరోమారు టెండర్లు ఆహ్వానిస్తామని వివరించింది. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


తాజా ఉత్తర్వులు
డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్, ఆపరేట్ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాన్‌జెడ్ కో) నిర్ణయించింది. ఇందుకోసం ప్యాకేజీ 1 లో భాగంగా 82 లక్షల స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. అందరికంటే తక్కువ ధరకు కోట్ చేసిన అదానీ కంపెనీకి ఈ టెండర్ దక్కింది. అయితే, అదానీ కంపెనీ ఆఫర్ చేసిన ధర (మిగతా కంపెనీల ధరతో పోలిస్తే తక్కువే) చాలా ఎక్కువని టాన్ జెడ్ కో తెలిపింది. దీంతో ఈ టెండర్ ను రద్దు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts
డాక్టర్ రేప్ కేసు : కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం
kolkata doctor case

మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్‌కతా కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర Read more

‘ఇండియా’ ఎన్నికల్లో పోటీ కోసం కాదు: ఫరూక్ అబ్దుల్లా
farooq abdullah

ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ శాశ్వతమని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ Read more

నేడు రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
PM Modi to lay foundation stones of projects worth Rs 7600 cr in Maharashtra

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (బుధవారం) మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌ మోడ్‌లో Read more

Water Tank : వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు మృతి
Water Tank Collapse: వాటర్ ట్యాంక్ లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

మహారాష్ట్రలో విషాదం: సరదాగా ఎక్కిన వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి ఘటనకు సంబంధించిన వివరాలు మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సుఖదాంబ Read more