glass bridge

అందుబాటులో కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జి

మరికొన్ని గంటల్లో కొత్త ఆశయాలు, కోరికలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటుంన్నాయి.
ఈ క్రమంలో దక్షిణాన చిట్టచివరి ప్రాంతం కన్యాకుమారికి వెళ్లే వారికి శుభవార్త వినిపించింది తమిళనాడు ప్రభుత్వం.

Advertisements


గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంకే స్టాలిన్
కన్యాకుమారి వద్ద కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. దీన్ని ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఈ గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొందరు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మక తిరువళ్లువర్ విగ్రహం- వివేకానంద రాక్ మెమోరియల్‌ను కనెక్ట్ చేస్తూ నిర్మితమైన అద్దాల వంతెన ఇది. దీని నిర్మాణ వ్యయం 37 కోట్ల రూపాయలు. బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం సంగమించే ప్రదేశంపై ఇది నిర్మితమైంది. దీని పొడవు 77 మీటర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 133 అడుగుల ఎత్తు ఉన్న తిరువళ్లువర్ విగ్రహాన్ని నెలకొల్పి 25 సంవత్సరాలవుతోంది. 2000 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి దీన్ని ప్రారంభించారు. 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు తిరువళ్లువర్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది.

Related Posts
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

Donald Trump: ట్రంప్ కొత్త విధానాలు – విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు
ట్రంప్ కొత్త విధానాలు - విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, కళాశాలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా లేదా పాలస్తీనా అనుకూల Read more

పరువునష్టం కేసులో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి ఊరట
Former Tamil Nadu CM Palaniswami gets relief in defamation case

చెన్నై: పరువునష్టం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రూ. 1.1 కోట్లను పరిహారంగా అందుకోనున్నారు. 2017 కొడనాడు ఎస్టేట్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి Read more

పరీక్ష రాస్తుండగానే విద్యార్థినికి పురిటి నొప్పులు
పరీక్ష మధ్యలోనే పురిటి నొప్పులు – ఆసుపత్రిలో పండంటి కూతురు జననం

పరీక్ష రాయడానికి ఎంతో కష్టపడి సిద్ధమైన ఓ మహిళకు, పరీక్ష మధ్యలోనే పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. పరీక్షను పూర్తిగా రాయలేకపోయినప్పటికీ, పండంటి కూతురికి Read more

×