Sea plane fares available to all. Services to start in 3 months. Rammohan Naidu

అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లో సేవలు ప్రారంభం : రామ్మోహన్‌ నాయుడు

విజయవాడ: నేడు విజయవాడ – శ్రీశైలం మధ్య “సీ ప్లేన్” ను సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీ ప్లేన్ టికెట్ రేట్లపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. టికెట్ రేట్లపై ఊహాగానాలే తప్ప.. సరిగ్గా ఇంత ధర ఉంటుందన్న విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ ను మన ఏపీలో ప్రారంభించబోతున్నారు. దీనిపై తాజాగా కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలో తొలిసారి సీ ప్లేన్ సేవలు ఏపీలో ప్రారంభం కావడం మనకి గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో గుజరాత్ లో సీ ప్లేన్ ను ప్రారంభించే ప్రయత్నాలు జరిగినా.. అవి సఫలం కాలేదన్నారు.

‘‘చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నేను కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి అయ్యాను. చంద్రబాబు నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు. సివిల్ ఏవియేషన్ అంటే అందరూ ఎయిర్ పోర్టులలో కనిపించే ప్లేన్లు అని అనుకుంటారు. కానీ అంతకంటే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. ఏవియేషన్ రంగంలో ఉన్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా పనిచేయాలని నాకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మార్గదర్శనం మేరకు నేను పనిచేశాను. విమానయాన సంస్థల ప్రతినిధులు, నిపుణులతో చర్చించి సీ ప్లేన్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన అన్ని విధివిధానలను రెడీ చేశాం’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్దనున్న పున్నమి ఘాట్‌కు సీ ప్లేన్‌ చేరుకుంది. కాసేపట్లో బ్యారేజీ నుంచి శ్రీశైలం దాకా సీ ప్లేన్‌లో సీఎం చంద్రబాబు ప్రయాణించనున్నారు. ఈనేపథ్యంలో పున్నమి ఘాట్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14 మంది కూర్చునేలా సీ ప్లేన్‌‌లో సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు.

సామాన్యుడు సీ ప్లేన్ లో ప్రయాణించేలా ధర అందుబాటులో ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మరో 3,4 నెలల్లో ఏపీలో సీ ప్లేన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 రూట్లలో సీ ప్లేన్లను నడిపే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ – నాగార్జున సాగర్ , విజయవాడ – హైదరాబాద్ రూట్లకు కూడా ఆమోదం వచ్చిందని, అమరావతికి కనెక్ట్ చేసేలా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ట్రావెల్ కు మరో 4 నెలల సమయం పడుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. 2025 మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమిఘాట్ వద్ద నుంచి సీఎం సీ ప్లేన్ ను ప్రారంభించి.. అందులోనే శ్రీశైలం వరకూ ప్రయాణించనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎం శ్రీశైలంకు చేరుకోనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సీ ప్లేన్ లో 14 మంది కూర్చునేలా సీటింగ్ ఉంటుంది. నీటిపైనే టేకాఫ్, ల్యాండింగ్ ఉంటాయి. సీ ప్లేన్ ద్వారా 30 నిమిషాల్లోనే శ్రీశైలంకు చేరుకోవచ్చు.

Related Posts
జనాలు ఛీ కొట్టిన జగన్ తీరు మారడం లేదు – షర్మిల
YCP does not have guts to go to assembly: Sharmila

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యుల తీరుపై Read more

జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు
COCK FIGHT

సంక్రాంతి కనుమ సందర్బంగా తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. కనుమ రోజున పందాలు జోరుగా Read more

మెగా అభిమానులకు పండగే పండగ
gamechanger song

మెగా అభిమానులకు ఇక నుండి పండగే పండగ. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ Read more

ప్రభుత్వం కంటే ప్రైవేట్ పాఠశాలలు గొప్పవా ? : సీఎం రేవంత్ రెడ్డి
Are private schools better than government schools?: CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ..నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల Read more