మార్చిన వార్తా విశేషాలు - ఆది వారం మార్చి   14th 2010 - 2:01 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
మళ్లీ మా వృద్ధి రేటు పెరుగుతుంది
శని వారం, నవంబర్ 21, 2009 , 1:48 [IST]

manmohanవాషింగ్టన్‌ నవంబర్‌ 20:- ఇండియా జిడిపి మళ్ళీ తొమ్మిది శాతం చొప్పున అభివృద్ధి సాధించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని అభివృద్ధిచెందిన దేశాల నుంచి వస్తున్న నిధుల ప్రవాహం వల్ల ఇది సాధ్యం అవుతుందని, త్వరలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వ్యక్తం చేసారు. వాషింగ్టన్‌ పోస్టుకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో పారిశ్రామికులకు, వ్యాపార వేత్తలకు కొరతలేదని, అమెరికా విద్యా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉన్నదని, అందువల్ల ఈ తాత్కాలిక ఆర్థిక మాంద్య సమస్యను అధిగమిస్తుందని పేర్కొన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు తొలి అతిథిగా వచ్చే దేశాధినేత కానున్నారు. ఇండియా,అమెరికాల మధ్యకుదిరిన పౌర అణు ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతున్నది. ఆర్థిక మాంద్యం వల్ల విదేశీ నిధుల ప్రవాహం తగ్గిందని అందువల్ల వృద్ధి రేటు మందగించిందని అయితే ఇటీవలి కాలంలో నిధుల ప్రవాహం పెరగడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు.

రెండు సంవత్సరాల్లో మళ్ళీ తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధిస్తామని చెప్పారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరంగా ఉన్నదని, వ్యర్థ ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకింగ్‌ నిబంధనలు ఇండియాలో అనుమతిందని ఆయన స్పష్టం చేసారు. భారతీయ ప్రధానిగా తాను కొంత ప్రభావం చూపానని, అయితే దీనిపై తుది తీర్పు భవిష్యత్తు తరాలదేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యానించారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 రానే-టిఆర్‌డబ్ల్యు కొత్త యూనిట్‌
 భారీగా టీ ఎగుమతి
 పారిశ్రామిక వేత్తలకు గవర్నర్‌..
 జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
 యూనివర్సల్‌ భారీగా విస్తరణ
 ఎస్‌ఎమ్‌ఎస్‌ఇలను ప్రోత్సహిస్తాం
 నిబంధనలను ఉల్లంఘిస్తున్న వేదాంత
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com