మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
పిల్లలందరితో ఒకేలా ఉండొద్దు
శని వారం, నవంబర్ 21, 2009 , 1:39 [IST]

పిల్లల్ని చక్కగా పెంచడం అనేది సాధారణ విషయం కాదు, అల్లరి పిడుగులు ఉన్న తల్లులకు ప్రతిరోజు ఒక పరీక్షలాగే ఉంటుంది. అలాంటి అమ్మలకోసం కొన్ని సూచనలు ఇదిగో.పిల్లలు బాగా అల్లరి చేసిన సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తూ ఉంటారు. కొట్టడం, తిట్టడం, బెదిరించడం టీచర్లకి చెబు తానని భయపెట్టటం మొదలైనవన్నీ. అయితే ఇలాంటి సందర్భాల్లో కాస్త సహనంగా వ్యవ హరించి ఉంటే బాగుండేది అని తరువాత అనిపిస్తుంది. ఇలా అనుకునేవారు ఆయా సందర్భాల్లో నిజంగానే సహనంగా ప్రవర్తించాలి అంటే- మీఇంట్లో జరుగుతున్న వ్యవహారమంతా ఎవరైనా గమనిస్తున్నారు అనే భావనతో ఉండండి. దాంతో ఇతరుల ముందు ఎలా మర్యాదపూర్వకంగా సహనంగా ప్రవర్తిస్తారో అలా మారగలుగుతారు.

అల్లరిచేసే పిల్లలు అందరికీ ఒకటే మంత్రం పని చేయదు. ఒక తల్లి ఈ విషయం గురించి ఇలా చెబుతోంది-'నాకు ఇద్దరు పిల్లలు. వారి అల్లరిని కంట్రోల్‌ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి పాటిస్తాను. పదిహేనేళ్ల మా పెద్దబాబుని మాట వినేట్టు చేయడానికి పాకెట్‌ మనీ  లేదా మొబైల్‌ ఫోన్‌ని కట్‌ చేస్తాను. ఆరేళ్ల రెండవవాడి అల్లరి ఆపడానికి వాడిని వాడి బెడ్‌రూం లోంచి బయ టకి రానివ్వనని బెదిరిస్తాను.తల్లులు ఒక విష యాన్ని గమనించాలి. పిల్లలు అందరూ ఒక్కలా ఉండరు. వారిని ఆపాలంటే ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి పాటించాలి.పిల్లలు అల్లరి చేయగానే వారిని పట్టుకుని  తిట్టటం, కొట్టటం చేసేస్తారు చాలామంది. అలా కాకుండా వారు చేసిన పని ఎందుకు సరికాదో, మనం ఎందుకు శిక్ష విధిస్తున్నామో వారికి తెలిసేలా చెప్పాలి.

పిల్లల్ని మన చెప్పుచేతల్లో ఉంచడం, మనం చెప్పినట్లు వినేలా చేయటం అంత తేలిక కాదు. కొంతమంది పిల్లలు బాగా చిలిపి పనులు చేస్తూ ఫూల్స్‌లా ప్రవర్తించి తల్లిదండ్రుల్ని ఏడిపిస్తుం టారు. తల్లిదండ్రులు ఏం చెబుతారో దానికి వ్యతిరేకంగా చేయాలని చాలామంది పిల్లలు అనుకుంటారు. ఇలాంటపుడు తల్లిదండ్రులు ఇరిటేషన్‌కి గురికాకుండా నవ్వి ఊరుకుంటే సరిపోతుంది. పిల్లలతో వాదనకు దిగకుండా, మీరు చెప్పదలచుకున్నది చెప్పేముందు తప్ప కుండా వారు చెబుతున్నది వినాలి. హాస్యంతో మీ పిల్లల్ని వారి అభిప్రాయాలనుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయడమూ మంచిదే.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com