మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం మార్చి   16th 2010 - 2:11 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఉద్యోగాల్లో మారుతున్న వస్త్రధారణ పద్ధతి
శని వారం, నవంబర్ 21, 2009 , 1:40 [IST]

cheliమిలీనియం మహిళ ఇప్పుడు కార్పొరేట్‌ ప్రపం చంలో తనదైన ప్రాధాన్యతను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇండియాలోని మహిళలు తమ డ్రెస్‌ కోడ్‌ కేవలం చీర, సల్వార్‌ కమీజ్‌ మాత్రమే అయి ఉండాలని అనుకోవడం లేదు. సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌నెస్‌ మాత్రమే ఈ రంగానికి సరిపోదు.కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా తమను తాము ఎక్స్‌ప్రెస్‌ చేసుకునే విధంగా డ్రెస్సింగ్‌ ఉండాలి. పూర్తిగా సూట్‌లతో కూడిన మోడల్స్‌ ఆడవారికి అంతగా నప్పవు. మగవారితో సమానంగా సూట్‌ను ధరించడం సాధ్యపడదనే వీలూ లేదు. ఫ్యాషన్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో అసాధ్యమేదీ లేదు. మహిళల కంఫర్ట్‌కు తగ్గట్టుగా డిజైనర్‌లు ఎన్నోరకాల దుస్తులను డిజైన్‌ చేస్తున్నారు.ఎమ్‌ఎన్‌సి కంపెనీలు కూడా తమ మహిళా ఉద్యోగుల డ్రెస్‌సెన్స్‌ను బాగా గమ నిస్తుండటం విశేషం.

తమ కెరీర్‌ గురించి ఆలోచించే వారు తప్పనిసరిగా తమ డ్రెస్‌సెన్స్‌ను కూడా గమనించుకోవాలి అంటారు డిజైనర్‌ పూజా మెహతా. పని చేసేచోట చాలా క్యాజువల్‌వేర్‌ అంటే ఫ్యాన్సీ డ్రెసెస్‌, సాండిల్స్‌, షాట్స్‌ వంటివి మీ శరీరానికి నప్పినా ఆఫీస్‌ అఫిషియల్‌నెస్‌ను దెబ్బతీస్తాయి.ఫ్యాషన్‌ అంటే కొత్తగా వచ్చిన ప్రతిదాన్నీ గుడ్డిగా ఫాలో కావడం కాదు. ఆఫీస్‌ వాతావరణంలో సమ యానికి తగ్గ డ్రెస్‌ను ఫాలో కాగలగడం తెలియాలి. మహిళలు ఎన్నోరంగులతో ఎక్స్‌పర్‌మెంట్‌ చేయ గలరు. ఉదాహరణకు మీరొక ట్రెడిషినల్‌ కార్పోరేట్‌ సంస్థలో పనిచేస్తుంటే వైట్‌ నావీసూట్‌తో పాటు ముత్యాల దండను ధరించండి.వాటితోపాటు వాడే యాక్ససరీస్‌ రంగుల్లో ఉన్నా పరవాలేదు. ఇది చక్కని లుక్‌ను ఇస్తుంది. దుస్తులు రంగురంగుల షేడ్‌లు కనిపించేలా ధరించకండి.

అలాగే చెవులకు చిన్న పోగులు(స్టడ్స్‌) లేదా డ్రాప్స్‌ ధరించండి. వేళ్ళాడే పెద్ద హ్యాగింగ్స్‌ ఆఫీస్‌లకు ధరించనవసరం లేదు. మిగిలిన వాటిలో ముఖ్యంగా ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు. రంగులతో లేక ఫ్యాన్సీగా ఉండేవి వాడకుండా ఉంటేనే మంచిది. గోల్డ్‌కలర్‌, సిల్వర్‌, బ్లాక్‌మెటల్‌ను ఉపయోగించవచ్చు. గంజి పెట్టిన కాటన్‌ చీరలు, నల్లని ప్రింట్‌లున్నవి మరీ డాబుగా కనిపిస్తుంటాయి. ప్లైన్‌ కాటన్‌ సల్వార్‌-కమీజ్‌ పై సిల్కీ దుపట్టా చక్కని క్లాసికల్‌ లుక్‌ను ఇస్తుంది. ఇవే కాక ఫ్లాట్‌-ఫ్రంట్‌ ట్రౌసర్‌, త్రీ-ఫోర్త్‌ లెంక్త్‌ టాప్స్‌, కాటన్‌-లెనెన్‌ బ్లెండెడ్‌ షర్ట్స్‌, మల్టిఫుల్‌ ఫంక్షన్‌ జాకెట్‌ సూట్స్‌ వంటివి కూడా కొన్ని కార్పోరేట్‌ ఆఫీస్‌ కల్చర్‌కు సెట్‌ అవుతాయి. ఆఫీస్‌ యూజ్‌ డ్రెస్‌ సోమరితనాన్ని ప్రదర్శించేలా ఉండకూడదు. కుర్తాలు, మోకాలి వరకూ ఉండే స్కర్ట్‌లు విశ్రాంతిని సూచిస్తాయి. పనిలో యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించాలంటే సెమీ ఫార్మల్స్‌కు దూరంగా ఉండాలి. బాడీకి ఫిట్‌గా ఉన్న ట్రౌసర్‌తో పాటు పోలోనెక్‌ టై ధరించవచ్చు. స్ట్రిప్ప్‌డ్‌ షర్ట్‌తో జీన్స్‌, స్ట్రైట్‌ స్కర్ట్స్‌ మొదలైనవి మంచి ఆఫీస్‌వేర్‌గా చెప్పవచ్చు.

dressరంగుల ఎంపిక
మీ వార్డ్‌బోర్డ్‌లో అన్నింటికీ అనువైన కొన్ని రంగులను చేర్చండి. మీరు వెస్ట్రన్‌ దుస్తులు ఎక్కువగా ధరిస్తున్నట్లైతే కనీసం ఒక ప్యాంట్‌, స్కర్ట్‌, జాకెట్‌ తప్పనిసరిగా ఉండాలి. నలుపు రంగు ఎప్పటికీ ఫ్యాషన్‌బుల్‌ కలర్‌. నావీబ్లూ, బ్రౌన్‌, డార్క్‌ పర్పల్‌, డార్క్‌ గ్రే కలర్‌లను కూడా సెలక్ట్‌ చేసుకోవచ్చు. నావీబ్లూని బ్లాక్‌తో, గ్రే- కామిల్‌, రెడ్‌-గ్రే, గ్రే-వైట్‌, వైట్‌ అండ్‌ బ్లూ కాంబినేషన్‌లను వాడచ్చు. క్లాసికల్‌ దుస్తులు ధరిస్తున్నట్లైతే ముదురు రంగులు, బోల్డ్‌గా ముద్దగా ఉండే ప్రింట్‌ ఉన్న దుస్తులను ఎంచుకోకుండా ఉంటే మంచిది.

వీటితోపాటుగా మరికొన్ని

మీ వెంట ఎప్పుడూ వచ్చేది మీ హ్యాండ్‌బ్యాగ్‌. మరీ పెద్దగా ఉండి చూడగానే ఏమి తీసుకుపోతున్నామో అనిపించేలా బ్యాగ్‌ సైజ్‌ ఉండకూడదు.అనవ సరమైనవి లేకుండా చిన్న హ్యాండ్‌బాగ్‌ కేరీ చేయడానికి వీలుగా ఉండేలా తీసుకోవాలి. లేదా మీడియం సైజుని సెలక్ట్‌ చేసుకోవాలి. బ్యాగ్‌ కలర్‌ కూడా కొట్టొచ్చే రంగులతో కాకుండా బ్టాక్‌, బ్రౌన్‌, కామిల్‌ కలర్స్‌లో ఉండేలా చూసుకోవాలి. వీటి తరువాత స్థానం జ్యూయలరీది. చెవులకు వాడే స్టడ్స్‌ చిన్నగా ఉండాలి. క్వాలిటీ ఉన్న మెటల్‌తో తీసుకోవడమే ఉత్తమం. బంగారం, లేదా వెండి స్టడ్స్‌ ఉపయోగించవచ్చు. వాచీలంటే పెద్ద పెద్ద డైల్‌తో ఉంటే ఎబ్బెట్‌గా ఉంటుంది. చిన్నడైల్‌తో పాటుగా లెదర్‌, లేక మెటల్‌తో ఉన్న స్టాఫ్‌ను ప్రిఫర్‌ చేయచ్చు. మెడకు లైట్‌గా ఉండే గోల్డ్‌ లేక సిల్వర్‌ చైన్‌ ముచ్చటగా ఉంటుంది.

హెయిర్‌ స్టైల్‌ విషయంలో కూడా శ్రద్ధ తీసు కోవాల్సిందే. నెటెడ్‌, షార్ట్‌ హెయిర్‌ స్టైల్‌ కంఫర్ట్‌గా ఉంటాయి. లాంగ్‌ హెయిర్‌కు సింపుల్‌ స్టైల్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. నైల్స్‌కు గాడీగా నిండు రంగులను వేయకూడదు. లైట్‌ కలర్‌తో ట్రిమ్‌చేసిన నెయిల్స్‌ అఫిషియల్‌ లుక్‌నిస్తాయి.కార్పోరేట్‌ ప్రపంచం మహిళకు కూడా అంతు లేని అవకాశాలను, దేశ దేశాలను చుట్టే అవకాశాలను కల్పిస్తోంది. దానికి తగ్గ కల్చర్‌ను పెంపొందించు కోవడం మన కర్తవ్యమే. మీ ఆఫీస్‌ వాతావరణానికి తగ్గట్టు మీ మేకప్‌, డ్రెస్సింగ్‌, యాక్ససరీస్‌ ఉంటేనే మీకు గుర్తింపు ఉంటుంది. మరి మీ స్టైలేమిటో మీరే తయారు చేసుకోండి.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ఔషధ ఉగాది
 శ్రీవికృతినామ సంవత్సర స్త్రీలకు..
 ముద్దుగానే ముద్ద
 'చారిత్రికంతో మల్లాది వసుంధర..
 'స్త్రీ శక్తి మహెజబీన్‌
 మనదే మరోలోకం
 మనలో మనం దిశగా
 ముందంతా మహిళా ప్రపంచమే
 అబ్బాయిలు బిడియపడితే
 ఇది మహిళా వికాస తరుణంthis time for ladies
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com