| భార్య భర్తల మధ్య కొత్త కోణం |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:21 [IST] |
 |
|
ప్రకాష్‌రాజ్, భూమిక ప్రధాన పాత్రల్లో టేకుల కృపాకర్‌రెడ్డి దర్శకత్వంలో ఆమోద్ ఎంటర్‌టైన ్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వర రావ్ఞ మాట్లాడుతూ 'భార్య, భర్తల మధ్య జరిగే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. భార్య, భర్త మధ్య కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించాం. చదువ్ఞకున్న అమ్మాయి కథే ఈ చిత్రం అని అన్నారు.దర్శకుడు టి.కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ 'ఒక అమ్మాయి పెళ్ళి తర్వాతి జీవితంలో ఎదుర్కొనే సంఘటనల సమాహారమే ఈ చిత్రకథ.
డిసెంబర్ నాటికి సినిమాను పూర్తిచేసి చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరున గానీ, జనవరి మొదటి వారంలో గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. పరుచూరి వెంకటేశ్వరరావ్ఞ, వైజాగ్ ప్రసాద్, శివపార్వతి నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్నా, కెమెరా: కాండ్రు పూర. నిర్మాత: అమోద్ ఎంటర ్‌టైన్‌మెంట్స్, కథ, దర్శకత్వం: టేకుల కృపాకర్ రెడ్డి.
|
|
|
|
|
|
|