| జనవరి రెండోవారంలో నాగార్జున చిత్రం |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:19 [IST] |
 |
|
నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం జనవరి రెండోవారంలో విడుదల కానుంది. 2010 నాటికి నిర్మాణ సంస్థ ప్రాంభించి 20 ఏళ్ళవ్ఞతుంది.గతంలో ఈ సంస్థలో నిర్మించిన 'శ్రావణ సంధ్య, 'ముఠామేస్త్రీ సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించాయి. నిర్మాత చిత్ర విశేషాలను తెలుపుతూ ' నాగార్జున, మోడల్స్ పాల్గొన్న ఓ పాటను చిత్రీకరించాం.ప్రస్తుతం నాగార్జున, కెల్లీ జార్జ్‌లపై ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది.
'స్లమ్ డాగ్ మిలియనీర్‌లో విలన్‌గా నటించిన అంకుర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.అమెరికాకు చెందిన లిండే మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. జనవరిలో నాగ చైతన్యతో భారీ చిత్రాన్ని ఇదే సంస్థలో నిర్మిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకట్.
|
|
|
|
|
|
|