| జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ఎపి హవా |
| శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:43 [IST] |
 |
|
జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ఎపి హవా వరంగల్, నవంబర్ 19, ప్రభాతవార్త క్రీడా ప్రతినిధి : నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి బాలబాలికల అథ్లెటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్స్ మూడవరోజైన గురువా రం తమ సత్తాచాటారు. రెండు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు సాధించారు. పోల్‌వా ల్ట్‌లో అవదేశ్‌కుమర్ యాదవ్, లాంగ్‌జంప్‌లో సాబాభగత్ స్వర్ణాలు సాధించారు. 14ఏళ్ల 100 మీటర్ల బాలికల విభాగంలో బి.శ్రీలేఖ రజతం, అండర్-18 400 మీటర్ల బాలికల విభాగంలో మౌనిక, అండర్ -16లో సుష్మ, 20 ఏళ్ల 100 మీ టర్లలో శాంతి, హైమర్ త్రోలో ఆప్తాబ్‌హలంలు కాంస్యాలు సాధించారు. విజేతల వివరాలిలా ఉన్నా యి. అండర్-20 బాలుర పోల్‌వాల్డ్‌లో వై.అవదేశ్ కుమార్ (ఆంధ్రప్రదేశ్), దేవేందర్ (హర్యానా), ఉమేష్‌యాదవ్ (ఉత్తరప్రదేశ్), హైమర్‌త్రో 20ఏళ్ల బారుల విభాగంలో హర్మిందర్, నారాయణసింగ్ (ఉత్తరప్రదేశ్), ఎండి.అప్తాబ్‌హలం (ఆంధ్రప్రదేశ్) స్వర్ణ, రజత, కాంస్యాలు సాధించారు. బాలికల 20 ఏళ్ల విభాగం 100 మీటర్లలో నంద (ఒరి స్సా), శిల్ప (కేరళ), శాంతి (ఆంధ్రప్రదేశ్), 14 ఏళ్ల బాలికల విభాగంలో కరెన్‌మిస్త్రీ (మహరాZష), టీనా (తమిళనాడు), టి.శ్రీలేఖ (ఆంధ్రప్రదేశ్) స్వర్ణ, రజ తాలు సాధించారు. జావెలిన్ త్రోలో అమిత్‌కుమార్ (గుజరాత్), భూపేందర్‌సింగ్ (పంజాబ్), అరవింద్‌కుమార్ (హర్యాన), 20 ఏళ్ల బాలికల పోల్‌వాల్ట్‌లో రమ్య, దీజా (కేరళ), రోహిణి (తమిళ నాడు), 16 ఏళ్ల బాలుర షాట్‌పుట్‌లో గురుప్రీత్ సింగ్ (పంజాబ్), పవన్‌కుమార్ (ఉత్తరప్రదేశ్), ప్రథమన్‌సింగ్ (హర్యాన), 14 ఏళ్ల బాలికల హైజం ప్‌లో శ్రీరస్తిసునిల్ (కర్ణాటక), అనిక (ఉత్తరప్రదేశ్), జిస్మి (కేరళ), 18 ఏళ్ల బాలికల హైమర్‌త్రోలో సోనమ్ (ఉత్తరప్రదేశ్), జ్యోతి, పూనం (హర్యాన), 18 ఏళ్ల బాలికల పోల్‌వాల్ట్‌లో అర్చన (పాండిచ్ఛేరి) అను, మిథునా (కేరళ), 16 ఏళ్ల బాలుర జావెలి న్‌త్రోలో అభిషేక్ (హర్యానా), ఆశీష్ (ఉత్తరప్రదేశ్), టోని(కేరళ)స్వర్ణ,రజత, కాంస్యాలు గెలుపొందారు. బాలికల హైమర్‌త్రోలో నేషనల్ రికార్డు సీమాజాకర్ (హర్యానా) 51.91 మీటర్లు విసిరి నేష నల్ రికార్డు సాధించారు. 20 ఏళ్ల బాలుర షాట్‌పు ట్‌లో కూడా హర్యానాకు చెందిన నరేష్ 19.13 మీటర్లు విసిరి నేషనల్ మీట్ రికార్డు సాధించాడు.
|
|
|
|
|
|
|