మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
అట్టహాసంగా జాతీయ ఖోఖో పోటీలు ప్రారంభం
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:43 [IST]

అట్టహాసంగా జాతీయ ఖోఖో పోటీలు ప్రారంభం
యాదగిరిగుట్ట, నవంబర్‌ 19 ప్రభాతవార్త : దక్షిణ భారత 23వ జాతీయ ఖోఖో క్రీడలు నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్‌విఎస్‌ ఫౌండేషన్‌, కేసరి యూత్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ ఖోఖో క్రీడలను ఆలేరు ఎమ్మెల్యే బూడిది భిక్షమయ్యగౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ క్రీడలలో దక్షిణ భారతదేశంలో గల తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన స్త్రీ, పురుషుల ఖోఖో జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. శుక్రవారం కర్ణాటక, కేరళ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి జాతీయ క్రీడలను రాష్ట్ర, జిల్లా స్థాయి కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తుంటారని, అలాంటిది మారుమూల గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించి మట్టిలో మాణిక్యాలైన మరింత మంది క్రీడాకారు లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వహించడం విశేషం. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బూడిది భిక్షమయ్యగౌడ్‌ మాట్లాడుతూ ఎంతో ఓర్పు, సహనంతో వివిధ రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి తీసుకువచ్చి ఖోఖో క్రీడలను నిర్వహిస్తున్న ఎస్‌విఎస్‌ ఫౌండేషన్‌ కన్వీనర్‌, ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు గున్న సంజీవరెడ్డి, కేసరి యూత్‌ అసోసియేషన్‌ సభ్యులను అభినంధించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా దివానా సినిమాలోని పాయెలియా, స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాలోని జయహో పాటలపై విద్యార్ధులు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. ముందుగా క్రీడాకారులు మార్చి ఫస్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసి యేషన్‌ వివిధ రాష్ట్రాల కన్వీనర్లు వెంకట ఉమాపతి, అప్పన్‌పాండ్యన్‌, జెస్‌, నాయర్‌, నాగేశ్వర్‌రావు, ఎంపిపి దడిగె ఇస్తారి, సర్పంచి గొంగిడి సునిత, ఎంపిటిసి గొం గిడి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు
 ఆటగాళ్ళ గదులనుంచి పెద్దఎత్తున..
 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
 క్వార్టర్స్‌లో సైనా
 ఫైనల్‌లో భారత్‌
 ప్రపంచ చాంపియన్‌షిప్‌..
 లంకపై ప్రతీకారానికి సిద్ధమైన..
 వీరూకు శ్రీలంక బోర్డు క్షమాపణ
 గెలుపు దక్కింది
 భారత్‌కు గెలుపు కావాలి
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com