సఫారీలు ఓడితే భారత్‌కు రెండో స్థానం దుబా§్‌ు, నవంబరు 19: జోహానెస్‌బర్గ్‌లో శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాకు ఇంగ్లాండ్‌తో ఆరం భంకానున్న అయిదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంటే భారత్ ఐసిసి వన్డే ర్యాంకు మెరుగుకానుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశం లో జరిగిన వన్డే సిరీస్‌ను 4-2 కోల్పోయిన మహేంద్రసింగ్‌ధోనిసేన వన్డే ర్యాంకుల్లో ఒక స్థానం కోల్పోయి మూడో స్థానానికి దిగజారగా, అస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాలు వరుసగా తొలి రెండు స్ఠ్ఠ్ఠ్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు భారత్ రెండో స్థానా న్ని తిరిగి దక్కించుకోవాలంటే ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం సాధించాలి. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ సేన విజయం సాధిస్తే ఐసిసి వన్డే ర్యాంకుల్లో ఏకంగా 3 స్థానాలు మెరుగుప రుచుకు ఆరు నుంచి 3వ ర్యాంకుకు చేరుతుంది. దక్షిణాఫ్రికా పరాజయం పాలైతే రెండు నుంచి 5వ స్ఠ్ఠ్థానానికి దిగజారుతుంది. దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను 5-0తో గెలుపొందితే తన ద్వితీయ స్థానాన్ని సుస్థి రం చేసుకోవడమే కాక, అగ్రస్థానంలో ఆస్ట్రేలియాకు కేవలం రెండు ర్యాంకింగ్ పాయింట్ల తేడాతో చేరువ వుతుంది. అదే సిరీస్‌ను 3-2తో గెలుపొందగలిగితే సఫారీలు ఒక స్థానం చేజార్చుకుని మూడో స్థానాని కి చేరుకుంటారు. ధోనిసేన ఒక ర్యాంకు మెరుగు పరుచుకుని ద్వితీయ స్థానంలో నిలుస్తుంది. ఇంగ్లాండ్ జట్టు 3-2తో సిరీస్ కైవసం చేసుకోగలిగితే ఒక స్థానం మెరుగుపరుచుకుని, ప్రపంచ ర్యాకింగ్స్‌లో అయిదో స్థానం దక్కించుకుంటుంది. అప్పుడు కూడా దక్షిణాఫ్రికా భారత్‌కు రెండో స్థానం అప్పగిం చి తర్వాత స్థానానికి దిగజారుతుంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఫలితం ఎలా ఉన్న అగ్రస్థా నంలో ఆస్ట్రేలియాకు వచ్చిన ముప్పేమి ఉండదు. బ్యాటింగ్ విభాగం వ్యక్తిగత ర్యాంకుల్లో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్న మహేంద్రసింగ్‌ధోని, మైకెల్‌హసిలను అధిగమించడానికి ఈ సిరీస్ దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమిస్మిత్‌కు అవకాశమివ్వనుం ది. రేటింగ్ పాయింట్లతో స్వల్ప తేడాతో స్మిత్ బ్యాటిం గ్ విభాగంలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్, దక్షిణా ఫ్రికా సిరీస్ లో పాల్గొంటున్న ఆటగాళ్లలో ప్రస్తుతం స్మిత్ అంద రికంటే బ్యాటింగ్ ర్యాంకుల్లో ముందున్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ అయిదో స్థానం లో కొనసాగుతుండగా, జాక్వెస్‌కలిస్ 10వ స్థానంతో, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ (17వ ర్యాంకు), కాలింగ్‌ఉడ్ (18వ ర్యాంకు)లతో టాప్ -20 స్థానం సంపాదించి ఉన్నారు. వీరు కూడా ఈ సిరీస్‌లో తమ ర్యాంకులు మెరుగుపరు చు కోవాలన్న పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఆరో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా బౌలర్ డేల్‌స్టేన్ ఈ సిరీస్‌లో రాణించి తొలి రెండు స్థానా ల్లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ వెటోరి, బంగ్లాదేశ్ బౌలర్ షాకిబ్‌అల్‌హసన్ ర్యాంకులకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న భారత్ వచ్చేనెలలో వారితోనే 5 వన్డేల సిరీస్‌లో తలపడనుంది. భారత్ వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్లుగా ఆవిర్భవించడానికి లంక సిరీస్ దోహదపడనుంది.