మార్చిన వార్తా విశేషాలు - శని వారం మార్చి   13th 2010 - 7:40 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
తొలి టెస్ట్‌లో రికార్డుల మోత
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:38 [IST]

gambhirతొలి టెస్ట్‌లో రికార్డుల మోత
అహ్మదాబాద్‌, నవంబర్‌ 19: శ్రీలంక తొలి ఇన్నిం గ్స్‌లో రెండో అత్యధిక స్కోరు చేయడంతో కష్టాల్లో పడినట్టు కనిపించిన భారత్‌ను ఓపెనర్లు గౌతం గంభీర్‌, వీరేంద్రసెహ్వాగ్‌లు రాణించి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇవ్వడంతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్‌ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 760/7 స్కోరు వద్ద నాలుగో రోజు ప్రధమార్థం అనంతరం డిక్లేర్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇప్పటి వరకు భారత్‌ గడ్డపై 14 టెస్ట్‌లాడి ఒక్కదాంట్లోనూ గెలుపొందని లంకేయులు ప్రస్తుతం జరుగుతున్న 15వ టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా భారీ ఇన్నింగ్స్‌ నిర్మించినప్ప టికీ, వేగంగా ఆడిన ఆడిన సెహ్వాగ్‌ అర్థశతకం సాధించడం, నిలకడగా ఆడుతున్న గౌతంగంభీర్‌ 74 పరుగులతో అజేయంగా నిలువడంతో వారి ఆశలు కొంత మేరకు ఆవిరయ్యాయి. సెహ్వాగ్‌ 67 బంతుల్లో 7 ఫోర్లతో 51 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో రాహుల్‌ద్రవిడ్‌ 38 పరుగులతో రాణిస్తుం డగా వెల్‌గదెరా అతన్ని రెండో వికెట్‌గా దొరకపు చ్చుకున్నాడు. ఇంకా 5 ఓవర్లలో నాలుగో రోజు ఆటముగుస్తుందనగా గంభీర్‌కు జత కలిసిన అమిత్‌మిశ్రా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. గంభీర్‌ 120 బంతుల్లో 7 ఫోర్లతో 74 నైట్‌వాచ్‌మన్‌గా మిగిలాడు.  
రికార్డుల మోత...
అంతకు ముందు నాలుగో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంకకు కరీర్‌లో ఆరో డబుల్‌ సెంచరీ సాధించిన మహెళ జయవర్ధనే, ప్రసన్న జయవర్ధనేతో కలిసి రికార్డు భాగస్వామ్యం తో భారీ స్కోరు అందించాడు. వీరిద్దరు ఆరో వికె ట్‌కు 351 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం మహెళజయవర్ధనే భారీఇన్నింగ్స్‌కు అమిత్‌మిశ్రా తెరదించాడు. 435 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్స్‌తో సుమారు 11 గంటల పాటు క్రీజ్‌లో నిలిచి మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అతను 275 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.  12వ సారి 150 అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోరు సాధించిన జయవర్ధనే ఔటయ్యే సమయా నికే తన శతకాన్ని పూర్తి చేసుకున్న అతని భాగ స్వామి ప్రసన్న జయసూర్య భారత్‌పై తన రెండో సెంచరీ నమోదు చేయగలిగాడు. మొత్తం 314 బంతులు ఎదుర్కొన్న ప్రసన్న జయవర్ధనే 11 ఫోర్లతో 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. మహెళ ఔటైన అనంతరం బరిలోకి దిగిన ప్రసాద్‌ 21 పరుగుల స్కోరు వద్ద హర్భజన్‌సింగ్‌ బౌలింగ్లో ఔటవ్వడంతో శ్రీలంక 202.4 ఓవర్లో డిక్లేర్‌ చేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 15 టెస్ట్‌లాడిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత సాధించడం ఇది రెండో సారి మాత్రమే కావడం గమనార్హం. అలాగే భారత్‌గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో 450 పరుగులు దాటడం లంకేయులకు ఇదే మొదటి సారి. 12 సంవత్సరాల క్రితం కొలంబోలో జరిగిన టెస్ట్‌లో 6 వికెట్ల నష్టానికి 952 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్‌ చేసి భారత్‌పై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన లంకేయులకు ఈ టెస్ట్‌లో సాధించిన 760/7 స్కోరు రెండో అత్యధిక స్కోరుగా రికార్డుల కెక్కింది. తన కెరీర్‌లో నాలుగో సారి 250 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించిన మహెళజయవర్ధనే భారత్‌లో భారత్‌పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (275) సాధించిన ఆటగా డిగా ఘనత కెక్కాడు. మందకొడిగా ఉండి బౌలర్లకు ససేమిరా సహకారం అందివ్వలే పోతున్న  ఇక్కడ పిచ్‌పై నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 5 శతకాలు, 6అర్థశతకాలు నమోదవ్వడం గమనార్హం.
స్కోరు బోర్డ్‌:
భారత్‌ (తొలిఇన్నింగ్స్‌) : గౌతంగంభీర్‌ బి వెల్‌గదెరా 1, వీరేంద్రసెహ్వాగ్‌ ఎల్‌బిడబ్ల్యు వెల్‌గదెరా 16, రాహుల్‌ద్రవిడ్‌ నాటౌట్‌ 177, సచిన్‌ బి వెల్‌గదెరా 4, వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ బి ప్రసాద్‌ 0, యువరాజ్‌సింగ్‌ సి దిల్షాన్‌ బి మురళీధరన్‌ 68, మహేంద్రసింగ్‌ధోని సి జయవర్ధనే బి ప్రసాద్‌ 110, హర్భజన్‌సింగ్‌ బి మురళీధరన్‌ 22, జహీర్‌ఖాన్‌ ఎల్‌బిడబ్ల్యు హేరాత్‌ 12, అమిత్‌మిశ్రా నాటౌట్‌ 7, ఇషాంత్‌శర్మ స్టె జయవర్ధనే బి మురళీధరన్‌ 0.
అదనం-9, మొత్తం (104.5 ఓవర్లలో ఆలౌట్‌)- 426.
వికెట్ల పతనం: 1-14 (గంభీర్‌, 2.5), 2-27 (సెహ్వాగ్‌, 6.1), 3-31 (సచిన్‌, 6.4), 4-32 (లక్షణ్‌, 7.4), 5-157 (యువరాజ్‌, 36.1), 6-381 (ధోని, 87.1), 7-389 (ద్రవిడ్‌, 92.4), 8-414 (జహీర్‌ఖాన్‌, 101.2), 9-426 (హర్భజన్‌సింగ్‌, 104.1), 10-426 (ఇషాంత్‌శర్మ, 104.5)
బౌలింగ్‌: వెల్‌గదెరా 22-4-87-4, ప్రసాద్‌ 22-1-106-2, మాథ్యూస్‌ 12-1-50-0, మురళీధరన్‌ 25.5-4-97-3, హేరాత్‌ 22-2-79-1, దిల్షాన్‌ 1-0-3-0
శ్రీలంక: దిల్షాన్‌ సి ద్రవిడ్‌ బి జహీర్‌ఖాన్‌ 112, పరణవితన సి ధోని బి ఇషాంత్‌శర్మ 35, సంగక్కర సి టెండూల్కర్‌ బి జహీర్‌ఖాన్‌ 31, మహేళ జయవర్ధనే బి మిశ్రా 275, సమరవీర సి సింగ్‌ బి ఇషాంత్‌శర్మ 70, మాథ్యూస్‌ సి గౌతంగంభీర్‌ బి హర్భజన్‌సింగ్‌ 17, ప్రసన్న జయవర్ధనే నాటౌట్‌ 154, ప్రసాద్‌ సి మిశ్రా బి హర్భజన్‌సింగ్‌ 21
అదనం- 45; మొత్తం (202.4ఓవర్లలో)- 760-7
వికెట్లపతనం- 1-74 (పరణవితన, 16.5), 2-189 (దిల్షాన్‌,  43.1), 3-194 (సంగక్కర, 45.3), 4-332 (సమరవీర, 86.4), 5-375 (మాథ్యూస్‌, 96.2), 6-726 (మహేళజయవర్ధనే, 193.5), 7-760 (ప్రసాద్‌, 292.4)
బౌలింగ్‌: జహీర్‌ఖాన్‌ 36-6-109-2, ఇషాంత్‌శర్మ 33-0-135-2, హర్భజన్‌సింగ్‌ 48.4-4-189- 2, అమిత్‌మిశ్రా 58-6-203-1, యువరాజ్‌సింగ్‌ 16-1-64-0, సచిన్‌టెండూల్కర్‌ 7-0-20-0, వీరేంద్రసెహ్వాగ్‌ 4-1-19-0
భారత్‌ (రెండో ఇన్నింగ్స్‌): గౌతంగంభీర్‌ నాటౌట్‌ 74, వీరేంద్రసెహ్వాగ్‌  సి మాథ్యూస్‌ బి హెరాత్‌ 51, రాహుల్‌ద్రవిడ్‌ ఎల్‌బిడబ్ల్యు వెల్‌గదెరా 38, అమిత్‌మిశ్రా నాటౌట్‌ 12; అదనం: 15, మొత్తం (45 ఓవర్లలో) 190-2. వికెట్లపతనం: 1 -81 (సెహ్వాగ్‌, 16.6), 2-169 (ద్రవిడ్‌, 40.1).
72 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జయవర్ధనేలు
లంక బ్యాట్స్‌మెన్‌ మహేళ జయవర్ధనే, ప్రసన్న జయవర్ధనేలు ప్రపంచ క్రికెట్‌లో సరికొత్తరికార్డు సృష్టించారు. భారత్‌తో ఇక్కడజరుగుతున్న తొలి టెస్ట్‌లో వీరిరువురు ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు తిరగరాశారు. 1937ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డాన్‌బ్రాడ్‌మన్‌, జాక్‌ఫింగ్లిటన్‌లు ఆరో వికెట్‌కు నెలకొల్పిన 346 పరుగుల భాగ స్వామ్యం ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్‌లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నమోదై ఉంది. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ నాలుగో రోజున ఓవర్‌ నైట్‌బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన వీరిద్దరు ఆరో వికెట్‌కు 351 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బ్రాడ్‌మన్‌, అతని సహచరుని పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 దక్షిణాఫ్రికాను ఓడించి 9వ స్థానంలో..
 సెంటిమెంట్‌తో చేటు ఎవరికి?
 యూత్‌ ఛాంప్‌ ఫైనల్స్‌కు భారత సారథి..
 హడిల్‌ సెంచరీ-ఆసీస్‌ విక్టరీ
 మహిళల టి20 సిరీస్‌ భారత్‌ ఓటమి
 విజయమే లక్ష్యంగా ఇరు జట్లు
 మహిళల టి20 సిరీస్‌ సమం
 కొరియాపై న్యూజిలాండ్‌ విజయం
 హాకీలో భారత్‌కు పరాభవం
 చెన్నై స్కా ్వష్‌ ప్రధాన డ్రాకు..
 
 
ముఖ్య వార్తలు
  ఇంటర్‌ పరీక్షల్లో 39 మంది డిబార్‌
  నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది..
  సిపిపి కోశాధికారిగా..
  కాంగ్రెస్‌ నెత్తిన కుంపటిలా మహిళా..
  ధరలపై ధనాధన్‌
  భారీ స్కోరుపై కన్నేసిన ఇంగ్లండ్‌
  నేపాల్‌లో స్వామి రాందేవ్‌ యోగా..
  పాక్‌ ప్రతిపాదన తిరస్కరించిన..
  జైల్లో తన హత్యకు కుట్ర: హసీనా ఆరోపణ
  ఐటిసి ఇన్ఫోటెక్‌లో కొత్త ఉద్యోగాలు
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com