ముంబాయి ఉగ్రవాదుల - సిమ్‌కార్డు ఢిల్లీవాసిది ముంబాయి : గత సంవత్సరం నవంబర్ 26న దాడుల సందర్భంగా తమ పాకిస్థానీ కుట్రదా రులతో మాట్లాడటానికి ఉగ్రవాదులు ఉపయో గించిన మొబైల్‌ఫోన్‌కు సంబంధించిన సిమ్‌కార్డును ఓ ఢిల్లీ వాసి వద్ద దొరికినట్లు ఓ ప్రత్యక్షసాక్షి శుక్రవారం ఇక్కడ ట్రయల్‌కోర్టుకు తెలిపారు. ఢిల్లీవాసికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ముంబా యి పోలీసుల అభ్యర్ధన మేరకు ఫోన్ నెంబర్ ఉప యోగించిన సిమ్‌కార్డు గురించి తాను దర్యాప్తు జరిపానని, అది న్యూఢిల్లీలోని మసూర్‌పూర్ నివాసి సురేష్ ప్రసాద్ పేరుతో జారీ అయిందని మాజీ ఎయిర్ నోడల్ అధికారి సునీల్ తివారి జడ్జి ఎం.ఎల్.తహలియాని ఎదుట సాక్ష్యమిచ్చారు. తప్పుడు చిరునామా ఇచ్చిన ప్రసాద్ పేరిట గత సంవత్సరం అక్టోబర్ 5న సిమ్‌కార్డు జారీ అయిం దని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. ప్రసాద్ తన వద్ద సిమ్‌కార్డును కొనుగోలు చేశాడని, తన నుంచి వ్యక్తిగతంగా సేకరించాడని ఢిల్లీలో 'ఇండియా కమ్యూని కేషన్స్ దుకాణం నడుపుతున్న మరో సాక్షి గోవిందర్‌సింగ్ బక్షి కూడా సాక్ష్యమి చ్చారు. దర ఖాస్తుపై సురేష్ సంతకం చేశాడని, నివాస రుజువుగా విద్యుత్ బిల్లుతోపాటు తన ఫోటోను కూడా అంటించాడని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రసాద్ ఇచ్చిన ఢిల్లీ చిరునామాను తాము సందర్శించామని, అయితే అది నకిలీదిగా గుర్తిం చామని దర్యాప్తు అధికారి విలాస్‌వాంఖేడ్ పేర్కొ న్నారు. ప్రసాద్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అతని ఆచూకీ ఎక్కడనేది ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు.