మార్చిన వార్తా విశేషాలు - ఆది వారం మార్చి   14th 2010 - 2:01 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
హెల్త్‌ మిషన్‌ ద్వారా కుగ్రామాలకు వైద్య సేవలు
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 3:57 [IST]

helth హైదరాబాద్‌,నవంబర్‌19,ప్రభాతవార్త; మాతృ,శిశు సంరక్షణలో కీలక పాత్ర వహించే నర్సులు, మిడ్‌వై వ్స్‌ కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం 3180 కోట్ల రూపాయలను కేటాయించిందని కేంద్ర ఆరో గ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌ తెలపారు.

అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం వైద్య సేవలను విస్తరించాలన్న ఆలోచనతో 2005,ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ను ప్రారంభించిదని, ఈ పథకం కింద 24 గంటలూ మిడ్‌వైఫరీ సేవల కోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనంగా ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ప్రతి సబ్‌ సెంటర్‌కు ఒక ఎఎన్‌ఎంను నియమించామని అజాద్‌ చెప్పారు.

గురువారంనాడిక్కడ జరిగిన 9వ ఐసిఎం ఏసియా పసిఫిక్‌ మిడ్‌వైవ్స్‌ కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రి అజాద్‌ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. 21 దేశాల నుం చి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సునుద్దేశించి అజాద్‌ మాట్లాడుతూ బిడ్డ ప్రస వించాక తల్లి,పిల్ల ఆరోగ్యంగా ఉండేందుకు నర్సు లు,ఆయాలు ప్రముఖ పాత్ర వహిస్తారన్నారు.

నర్సింగ్‌,మిడ్‌వైఫరీ సేవలను మరింత మెరుగుప ర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని,ప్రసవం సమయంలో లైఫ్‌ సేవింగ్‌ మందులను నర్సులు,మిడ్‌వైఫ్‌లు నిర్వహించే విధంగా అనుమతిచ్చిందని అజాద్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నర్సులు,మిడ్‌వైఫ్‌ల కొరత తీర్చేందుకు గాను ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ విప్ల వాత్మక చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగం గా  నర్సింగ్‌ స్కూళ్లు, కాలేజీల ఏర్పాటు విషయం లో నిబంధనలను సడలించామన్నారు.

దేశంలో ప్రస్తుతం 1926 జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ ట్రైనింగ్‌ స్కూళ్లు, 1271 బియస్సీ నర్సింగ్‌ కాలేజీలున్నాయని ఆజాద్‌ తెలపారు. దేశ వ్యాప్తంగా 250 కొత్త ఎఎన్‌ఎం,జిఎన్‌ఎం స్కూళ్ల ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిం దన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఫిజీషియన్‌, నర్సుల నిష్పత్తి మన దేశంలో చాలా తక్కువగా ఉందని, గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో మరింత సమర్ధవంతమైన వైద్య సేవలందించేందుకు దేశ వ్యాప్తంగా  3.80 లక్షల మంది నర్సులు, 1.50 లక్షల మంది ఎఎన్‌ఎంలు అవసరమన్నారు.

ప్రస వానంతరం శిశువుల సంరక్షణ, వ్యాధి నిరోధక చర్యల విషయంలో నర్సులు,మిడ్‌వైఫ్‌లు కీలక పాత్ర వహిస్తారని, వారి సేవలను మరింత విస్తృత పర్చేందుకు ఎప్పటికప్పుడు కేంద్రం తగు చర్యలు తీసుకుంటోందని ఆజాద్‌ తెలిపారు. డాక్టర్లులేని మారుమూల గ్రామీణ,గిరిజన ప్రాంతాలలో మిడ్‌ వైఫ్‌లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రజలకు సేవలందిస్తారని, ప్రసవాలను నిర్వహిస్తారని, అందువల్ల సమాజంలో వారికి ప్రత్యేక గౌరవ ముందని చెప్పారు. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ ఏర్పాటయ్యాక నాలుగేళ్లలో గ్రామీణ వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని, దీని ద్వారా 15,000 మంది ఎంబిబియస్‌, ఆయుష్‌ డాక్టర్లు, 70,000 మంది నర్సులు,ఎఎన్‌ఎంలు, 7 లక్షల మంది కమ్యూనిటీ వర్కర్లు దేశ వ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్నారని ఆజాద్‌ తెలిపారు.

దేశంలో వైద్య సేవల విషయంలో  కేరళ ముం దుండగా ఒరిస్సా,మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు బాగా వెను కబడి ఉన్నాయన్నారు. ప్రసవం సమయంలో సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో శ్రీలంక దేశంలోని నర్సులు మంచి ప్రతిభను కనబ ర్చుతున్నారని, ఆ దేశంలో నర్సింగ్‌, మిడ్‌వైఫరీ సేవలు బాగున్నాయని కేంద్ర మంత్రి ఆజాద్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాతృ,శిశు సంరక్షణ విషయంలో ఆసియా పసిఫిక్‌ రీజియన్‌కు చెందిన దేశాలు బాగా సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆజాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆరో గ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దానం నాగేం దర్‌, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ  సుబ్రమణ్యం, కాన్ఫరెన్స్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎం.ప్రకాశమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాండ్స్‌ దట్‌ హెల్ప్‌ విమెన్‌ అనే అంశంపై పద్మశ్రీ శోభానాయుడు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం మహిళలను ఎంతగానో ఆకట్టుకుంది.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఎఫ్లూ..
 సిపిపి కోశాధికారిగా..
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com