మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 7:54 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
బ్లేడ్‌ గ్యాంగ్‌ బహిష్కరణ
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 3:45 [IST]

విజయవాడ, నవంబర్‌ 19, ప్రభాతవార్త : అరాచకాలకు పాల్పడుతున్న  ఐదుగురు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులను నగరంనుంచి బహిష్కరిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యుల ఆగ డాలు తీవ్రస్థాయికి చేరాయన్నారు.

దారిన వెళ్ళే ప్రజలపై బ్లేడ్‌లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి వారి నుంచి నగదు,వస్తువులు దొంగిలిస్తున్నారని చెప్పారు. మద్యం మత్తులో బ్లేడ్‌బ్యాచ్‌సభ్యులు ఒకరిపైమరొ కరు దాడులకు పాల్పడి హత్యలు చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయన్నారు. వివిధ దుశ్చర్య లకు పాల్పడుతూ ప్రజలను అశాంతికి గురిచేస్తున్నారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఐదుగురు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులను విజయవాడ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని వివరించారు. ఇప్పటికే వీరిపై అనేక క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

నగరం నుంచి బహిష్కరించిన బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుల్లో నగరంలోని కృష్ణలంకకు చెందిన సిరపంగి ఐజాక్‌, గాంధీపార్కు ఏరియాకు చెందిన బడకల్‌ శ్రీను, పప్పల నవీన్‌, రత్నంసెంటర్‌కు చెందిన కర్రి శ్రీనివాసరావు, వన్‌టౌన్‌ ఏరియాకు చెందిన మర్రి నాగమో హన్‌ వున్నారన్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 తెలంగాణ ద్రోహి టిఆర్‌సిసిసి: ..
 .ఎలుగుబంటి దాడి: ఒకరి మృతి
 'చేనేతకు చల్లని కబురు
 ఉపఎన్నికల్లో పోటీచేయకపోవడమే మేలు ..
 ఫ్రీ జోన్‌పై ధనాధన్‌ అట్టుడికిన..
 వైఎస్‌ ప్రజాహిత పథకాలను..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com