మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఓబుళాపురం ఉత్తర్వులపై స్టే
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 3:43 [IST]

హైదరాబాద్‌, నవంబర్‌ 19,  ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి  : అనంతపురం జిల్లా  ఓబుళాపురం అటవీ ప్రాంతంలో ఖనిజాలను వెలికితీయరాదనే అటవీశాఖ ఉత్తర్వులపై హైకోర్టు గురువారం స్టే విధించింది. అనంతపురం డివిజన్‌ అటవీ అధి కారి కల్లోల్‌ బిస్వాస్‌ జారీచేసిన 5750/87/ జి3వ ఉత్తర్వు చట్టబద్దతను సవాలుచేస్తూ అనం తపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ భాగస్వా ములో ఒకరైన జనార్ధన్‌రెడ్డి భార్య జి లక్ష్మీఅరుణ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ఎల్‌ నర్సింహారెడ్డి  విచారించారు.  తదుపరి ఆదేశాల జారీ వరకు ఖనిజాల వెలికితీత ప్రక్రియలో జోక్యం  చేసుకోరాదని  ఉన్నత  న్యాయస్థానం సూచించింది.

ఓబుళాపురం గనుల లీజును ఇరవై ఏళ్ళపాటు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ పొడిగించిందని, లీజు గడువు 2023ఆగస్టు 19తో ముగుస్తుందని అర్జీదారు తరఫు న్యాయవాది నివేదించారు. ఖని జాల వెలికితీతకు రాష్ట్ర గనులు, భూగర్భశాఖ. కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ అనుమ తించిందని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతి నవంబర్‌ వరకు అమలులో ఉం టుందని నివేదించారు.
ఖనిజాల వెలికితీతకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అనుమతించినందున రవాణాకు ప్రత్యేక అనుమతి అవసరంలేదని వాదించారు. ఖనిజాలు అటవీ ఉత్పత్తుల పరిధిలోనికావని, డిఎఫ్‌ఓ ఉత్త ర్వులు చట్టవిరుద్ధమని, కల్లోల్‌  బిస్వాస్‌ తమ మైనింగ్‌ సంస్థ పట్ల పక్షపాతంగా వ్యవహరిం చారని ఫిర్యాదు చేశారు. అటవీశాఖ ఉత్తర్వులపై స్టే విధించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

'బళ్లారి వ్యాజ్యం
అనంతపురం జిల్లా  ఓబుళాపురం శివారు లోని  తమ గనులను ఓబుళాపురం మైనింగ్‌ సంస్థ ఆక్రమించిందని,  22 నెలలుగా ఆక్రమిత గనులనుంచి ఖనిజాలను వెలికితీసి  అడవుల ద్వారా రవాణా చేస్తున్నారనే ఫిర్యాదుతో బల్లారి ఐరన్‌ ఓర్స్‌ సంస్థ  గురువారం  హైకోర్టులో వ్యాజ్యం దాఖలు  చేసింది.  రెండు సంస్థల గనుల హద్దులను నిర్ధారించాలనే ఉన్నత న్యాయ స్థానం గత ఆదేశాలు అమలుకు నోచుకోలేదని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిసి అగర్‌ వాల్‌ నివేదించారు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ,గనులు,భూగర్భ ఖనిజాలు, రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ సహా 18 సంస్థలు, శాఖలు, అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. గనుల ఆక్రమణ నియంత్రణ, రెండు సంస్థల గనుల హద్దుల నిర్ధారణకు ఆదేశించాలని అభ్యర్థించారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com