మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
నేరం చేశారో దొరికిపోయారే!
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:03 [IST]

thiefsకంప్యూటర్‌లో లక్ష మంది నేర స్తుల చిట్టా ్ త్వరలో 450 దేశవ్యాప్త ముఠాల వివరాలు ్ ఎక్కడ నేరం జరిగినా రాZ వ్యాప్తంగా సెకన్లలో సమాచారం ్ కేసుల సత్వర దర్యాప్తునకు రాష్ట్ర పోలీసుల కొత్త పద్ధతి

హైదరాబాద్‌, నవంబర్‌ 19, ప్రభాతవార్త :
నేరగాళ్ల భరతం పట్టేందుకు పోలీసు శాఖ సరికొత్త ఎత్తుగ డలను ఎంచుకుంది. ఇప్పటివరకున్న పద్దతులకు భిన్నంగా లక్ష మంది వరకు పేరు మోసిన నేర స్తుల చిట్టాను కంప్యూటరీకరించారు. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా అనుమానిత నేరగాళ్ల వివ రాలను ఆయా ప్రాంత పోలీసులు తమ కంప్యూ టర్లో సెకన్ల వ్యవధిలో తెలుసుకునే అవకాశం కల్పించడం ఇందులోని ప్రత్యేకత. రాష్ట్ర పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగం (పిసిఎస్‌) సాధిం చిన ఈఘనతవల్ల రాబోయేరోజుల్లో నేరాల నివా రణతోపాటు నేరగాళ్లను వీలైనంత త్వరలో పట్టు కునే అవకాశం వుంటుందని ఉన్నతాధికారులు అంటున్నారు.

రాష్ట్ర పోలీసు విభాగం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఇ-కాప్స్‌, ఆన్‌లైన్‌ సేవల విషయంలో దేశంలోనే అగ్రగామిగా వున్న పోలీసు శాఖ నేరగాళ్ల వివరాలను కంప్యూటరీక రించి వారిపైఉచ్చు బిగించేం దుకు సన్నాహాలు పూర్తి

జిజి చేసింది. మూడు వందల మందికి పైగా ఘరానా నేరగాళ్ల వివరాలతో కూడిన ఓ చిట్టాను నగర నేరపరిశోధనా విభాగం రెండేళ్లక్రితం విడు దల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధిం చిన వివరాలు పోలీసు వెబ్‌సైట్‌లో ఇప్పటికే వున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు పిసి ఎస్‌ మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఇప్పటి వరకు నేరాలకు పాల్పడిన పేరుమోసిన నేరగాళ్ల వివరాలతోకూడిన ఓబడాచిట్టానుఏకంగా పోలీసు వెబ్‌సైట్‌లో సవివరంగా పొందుపరిచింది. ఇం దులో ఇప్పటి వరకు 60 వేల మంది వరకు నేర గాళ్ల పూర్తి వివరాలను పోలీసు వెబ్‌సైట్‌లో వుం చగా మరికొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా బందిపోట్లు, దోపిడీలు, బడాచోరీలకు పాల్పడ్డ 450 ముఠాల వివరాలను పొందుపరచనున్నారు. ఈ ముఠాలో ఐదు వేల మంది వరకు వుండే వీలుంది. దీంతో పాటు మరో 35 వేల మంది నేరగాళ్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ పోలీసు వెబ్‌సైట్‌లో భద్రపరిస్తే తొలిసారిగా లక్ష మంది నేరగాళ్లను వుంచిన ఘనతను రాష్ట్ర పోలీసు విభాగం సొంతం చేసుకున్నట్లవుతుంది.

కంప్యూటరీకరణ వల్ల ప్రయోజనాలెన్నెన్నో
ఇదిలావుండగా లక్ష మంది వరకు నేరగాళ్ల చిట్టాను కంప్యూటకరించడం వల్ల పోలీసు శాఖకు చాలా ప్రయోజనాలుచేకూరనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా ఘటనా స్థలం వద్ద ఏదో ఒక క్లూ లభిస్తుంది. ఈ క్లూ వల్ల కేసు దర్యాప్తు చేసే పోలీసులకు ఎవరిపైనైనాఅనుమానాలు కలు గుతాయి.ఈ అనుమానాలఆధారంగాఅక్కడి పోలీ సులు తమ స్టేషన్లో వున్న కంప్యూటర్‌లో పిసి ఎస్‌ రూపొందించిన నేరగాళ్ల చిట్టాను ఒక్కసారి పరిశీలిస్తే కచ్చితంగా కొంత సమాచారం లభించే వీలుంది.ఉదాహరణకుసంఘటనాస్థలంలోఏదైనా సెల్‌ నంబర్‌ లేదా మరేదైనా వాహనం నంబర్‌ లభిస్తే వాటివివరాలతోకూడా కంప్యూటర్‌లో పరి శీలించే వీలుంది. దీంతో సదరు సెల్‌ నంబర్‌ లేదా వాహనం ఎవరిదో సెకన్ల వ్యవధిలో తెలిసి పోతుంది. వీటిఆధారంగాపోలీసులుకేసును ముం దుకు తీసుకువెళ్లవచ్చు. తమకు కావాల్సిన నేర గాళ్లు ఫలానా ప్రాంతంలో వున్నట్లు ఆయా ప్రాం తాల పోలీసులు సులభంగా తెలుసుకునే వీలుం టుంది. దీంతో నేరగాళ్లున్న ప్రాంతాల పోలీసు లను అప్రమత్తం చేసి వారిని పట్టుకునే అవకాశం వుంటుంది. నేరగాళ్ల వివరాలతో పాటువారి వ్యక్తి గత జీవితాలకు సంబంధించిన అంశాలు కూడా కంప్యూటరీకరించడం వల్ల స్థానిక పోలీసులకు మరింత వెసులుబాటు లభించింది.

దీర్ఘకాలిక ప్రయోజనాలు
రాష్ట్రంలో నేరగాళ్ల వివరాలను కంప్యూటర్‌లో భద్రపరచడంవల్ల దీర్ఘకాలికప్రయోజనాలు వున్నా యని పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ డైరక్టర్‌ టి. కృష్ణప్రసాద్‌ ప్రభాతవార్తకు తెలిపారు. పిసిఎస్‌ చేబట్టినపథకాలలో నేరగాళ్లచిట్టాను కంప్యూటరీక రించడం కూడా ఒకటని ఆయనన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడనేరాలుజరిగినామొదట అనుమా నితులను సులభంగాపట్టుకునే వీలుందని, దీంతో పాటు ఘటనా స్థలంలో లభ్యమయ్యే క్లూ ఆధా రంగా అసలు నేరగాళ్లను కూడా వీలైనంత తొంద రగా దొరకపుచ్చుకునే అవకాశం వుందని ఆయన తెలిపారు. దీంతోపాటు నేరాలకు పాల్పడిన దొం గలు ఏ ముఠాకు చెందిన వారో? ఏ ప్రాంతానికి చెందిన వారో..? సులభంగా తెలుసుకునే వీలుం టుందని ఆయన చెప్పారు.

దీనివల్ల నేరగాళ్లకు వీలైనంత తొందరలో శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు సఫలీకృతు లయ్యే వీలుంటుందని కృష్ణ ప్రసాద్‌ చెప్పారు. పోలీసు విభాగం కోసం రూపొం దించిన ఇంట్రానెట్‌ సహాయంతో రాష్ట్రం లోని అన్నిప్రాంతాల పోలీసులు ఎక్కడనేరం జరి గినా వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసు కునే అవకాశం వుంటుందని ఆయన వివరిం చారు. పోలీసువెబ్‌సైట్‌లో ఇప్పటివరకు ఎనిమిది వేల మంది తప్పిపోయిన వారి వివరాలతో పాటు ఆరువేల గుర్తు తెలియని మృతదేహాల వివరాలు, పోలీసులకు లభ్యమైన 30 వేల వాహనాల వివ రాలువున్నాయని, దీంతోపాటు మూడులక్షల 60 వేల ఎఫ్‌ఐఆర్‌లు కూడా ఇందులో వున్నాయని ఆయన పేర్కొన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com