మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   10th 2010 - 4:26 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
హ్యాండ్‌ బ్యాగ్‌ ఎంపికలో ఇవి ముఖ్యం
శని వారం, నవంబర్ 07, 2009 , 2:46 [IST]

bagsచిన్న అద్దం, హెయిర్‌పిన్నులు, దువ్వెన, బొట్టుబిళ్లలు, రబ్బరుబ్యాండ్లు, తలనొప్పి, జ్వరానికి సంబంధించిన మాత్రలు, లిప్‌స్టిక్‌, కాటుక, ఆఫీసుకు సంబంధించిన ముఖ్యమైన కాగితాలు, ఫోనునెంబర్లు, ఖాళీసమయాల్లో చదువుకోవడానికి ఒక పుస్తకం, పెన్ను, తెల్లకాగితాలు, టిఫిన్‌ బాక్సు, వాటర్‌బాటిల్‌, ఏదైనా ఒక రకం పండు లేదా బిస్కెట్‌ ప్యాకెట్‌.. ఇదేంటి ఎక్కడికో ప్రయాణ మవుతున్నపుడు సర్దు కోవాల్సిన వస్తువుల చిట్టా అంతా చెబుతున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.

ఇవన్నీ మామూలుగా మహిళల హ్యాండుబ్యాగుల్లో తప్పనిసరిగా ఉండే వస్తువులు. ఇలా ఎన్నిరకాల వస్తువులనైనా మూగగా మోసేసే హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంపిక చేసుకోవడం అంటే  మాటలా, కానేకాదు. అందుకే ఇలా ప్రయత్నించండి. సరైన హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. షాపుకు వెళ్లగానే రకరకాల మోడల్స్‌లో ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌లు మిమ్మల్ని తికమక పెడతాయి. అందుకే బ్యాగు కొనడానికి వెళ్లేముందే మీ అవసరాన్ని బట్టి ఎలాంటి బ్యాగు, ఎంత ఖరీదులో కొనాల నుకుంటున్నారో ఒకసారి అనుకోండి.

తరువాతి ఘట్టం బ్యాగుల సెలక్షన్‌. మీకు బాగా నచ్చిన బ్యాగులో మీకు కావాల్సిన ఎక్కువ అరలు లేకపోవడం, కావాల్సిన సైజులేకపోవడం లాంటి ఏదో ఒక లోపం కనిపిస్తుంది. దాంతో అలాంటి లోపాలులేని వాటికోసం వెతుకుతూ సమ యాన్ని, శక్తిని వధా చేసుకుంటూనే ఉంటారు. అలాకాకుండా ఉండాలంటే ఈ కింది సూచనలు గుర్తుంచుకుంటే సరి.

రంగు: మీకు ఇష్టమైన రంగు ఏమిటో ఆ కలర్‌ తీసుకుంటే దానిని చూసినపుడల్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే షాపుకి వెళ్లే ముందే మీకు నచ్చిన కలర్‌ ఏమిటనేద నిర్ణయించుకుంటే బ్యాగ్‌ ఎంపిక సులువవ్ఞతుంది. ఓపనింగ్స్‌: రోజుకు కనీసం 50 సార్లు బ్యాగు తెరవడం, మూయడం చేస్తుంటాం. అంత విరి విగా చేసేపనికి సులువుగా ఉండే మార్గాన్ని ఎంచుకోవాలి కదా. బ్యాగుకు ఉండే  ఓపనింగ్స్‌- జిప్పు, మాగ్నటిక్‌ డోసర్లు, బకెల్‌, డ్రాస్ట్రింగ్‌, ప్లాప్‌ ఇలా రకరకాల మోడళ్లలో  ఉంటాయి. వీటిల్లో మీకు ఏది అనువుగా అనిపిస్తుందో చూసి ఎంచుకోవాలి.

అదనపు ఆకర్షణలు: మీ హ్యాండ్‌బ్యాగులో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉండాలనుకుంటున్నారు? సెల్‌ఫోను పెట్టుకోవడానికి పాకెట్‌, ప్రయాణాల్లో రద్దీగా ఉన్నపుడు వెనకనుండి సులువుగా తెరవకుండా ఉండేలాంటి సౌకర్యం ఉండాలా, బయటివైపు చిన్న చిన్న పాకెట్లు ఉండి వాటికి జిప్పులు ఉండాలా, బ్యాగు లోపల ఎన్ని అరలు ఉండాలి, సీక్రెట్‌ పాకెట్స్‌ఉండాలా?  ఇలాంటి వాటిని కూడా దష్టిలో పెట్టుకోవాలి.

స్ట్రాప్స్‌: పైన చెప్పినవన్నీ ఉన్నా బ్యాగుకు సరైన స్ట్రాప్స్‌ లేవనుకోండి ఎక్కువకాలం వాడలేరు. అలాగే స్ట్రాపుల్లోను అనేకరకాలు ఉన్నాయం డో§్‌ు. స్ట్రాప్స్‌ లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా లేక గుండ్రంగా ఉండాలా? భుజానికి వేసుకునేలా ఉండాలా? చేతితో పట్టుకునేలా ఉండాలా లేకపోతే క్లట్చెస్‌, టోటిస్‌ ఇలా స్ట్రాప్‌ ఎలా ఉంటే మీకు అనువుగా ఉంటుందో కూడా చూసుకోవాలి. అలాగే మీ బ్యాగులో మీరేం పెట్టాలను కుంటున్నారు- ఇంటితాళాలు, బండితాళాలు, డబ్బులు అంతేనా లేకపోతే మొదట్లో చెప్పిన వస్తువులన్నీ ఉండాలా? అనేదాన్ని బట్టి కూడా ఎంపికఉండాలి. అమ్మో హ్యాండ్‌బ్యాగు కొనాలంటే ఇన్ని చూడాలా? అని ఆశ్చర్య పోకండి. ఈ పద్ధతి పాటించి చూడండి ప్రతిసారి చక్కటి హ్యాండ్‌ బ్యాగ్‌ మీ సొంతం అవ్ఞతుంది.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ఆస్కార్ విజేతగా అవతరించిన..
 కరుణా తరంగిణులు
 అంతిమ క్షణాన నిలువలేని సంస్కారం
 మహిళా శ్రామిక పోరాటానికి నూరేళ్లు
 చలువ కళ్ళద్దాలతో చెలిమి
 సాధారణ వ్యాయామం-4
 పుచ్చకాయ తొక్కతో
 ఫ్రెంచ్‌ నాట్‌
 మహిళ మహారాణి అవ్ఞతుందా?
 ఉత్సాహం ఉరకలై-ప్రయత్నమే పుస్తకమై
 
 
ముఖ్య వార్తలు
  అంతరిక్ష విజ్ఞానంలోనూ సగం
  రెండు రాష్ట్రాలుగా తెలంగాణ, సీమాంధ్ర
  లారీ, ఆటో ఢీకొని 12మంది మృతి
  భారత పాస్‌పోర్టు అప్పగించిన ..
  సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
  ఇంటి ముఖం పట్టిన మైఖెల్‌ క్లార్కె
  పెరిగిన కార్ల అమ్మకాలు
  ఎస్‌బిఐ చట్టం సవరణకు బిల్లు
  82వ ఆస్కార్‌ అవార్డులు
  ముమైత్‌ఖాన్‌ ఎల్‌ బోర్డ్‌
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com