న్యూఢిల్లీ, నవంబర్ 6 : భారత, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఇజాజ్ భట్ ఆశావహ ధృక్పధంతో ఉన్నాడు.ఇటీవల భారత్‌లో పర్యటించిన పాకిస్థాన్ బోర్డు అధ్య క్షుడు ఇజాజ్ భట్ బిసిసిఐ అధికారులతో పలు అంశాలపై చర్చించాడు. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు పునరుద్ధరించేందుకు సిరీస్ నిర్వహించాలని కోరాడు. తాము సిద్ధంగా ఉన్నా భారత్ సానుకూలంగా స్పందించకపోవడం వల్లే సిరీస్ నిర్వహించేందుకు అడ్డంకిగా మారిందని అన్నాడు.
ఇరు బోర్డులకు చెందిన అధ్యక్షులు సమావేశమై కీలక నిర్ణయాలపై ఆమోదం వ్యక్తం చేశారు. త్వరలో పాక్‌తో భారత్ తలపడుతోందని బిసిసిఐ స్పష్టం చేసింది. ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో పాల్గొనే పాక్ క్రికెటర్లకు బోర్డునుంచి అనుమతి లభించిందని తెలిపాడు. ఐపిఎల్-3లో పాల్గొనేందుకు తమ ఆట గాళ్లు భారత్ విచ్చేయనున్నారని, భద్రతా విషయంలో తమ క్రికెటర్లకు భారత్ పూర్తిస్థాయి భద్రత కల్పించిందన్నాడు. ముంబై దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబన తొలగించేందుకు సిరీస్‌ల నిర్వహణే ప్రధానమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలో ముగిసిన ప్రీమియర్‌లీగ్‌లో పాక్ క్రికెటర్లు పాల్గొన్నారు. కాగా భారత్‌లో నిర్వహించే మ్యాచులకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. భద్రతా చర్యల దష్ట్యా పాక్ క్రికెటర్లకు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయని భావించి క్లియరెన్స్ ఇవ్వలేదని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాగా, పాక్ ప్రభుత్వం మాత్రం భారత్‌లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. ఐపిఎల్‌లో మళ్లీ పాక్ క్రికెటర్లు? ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ తనను కలిసి అనుమతి కోరడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేం దుకు తమ క్రికెటర్లకు ఇచ్చినట్లు భట్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధ్యక్షుడు లలిత్‌మోడీతో చర్చించానని, తమ క్రికెటర్లకు అనుమతి లభించిందని వివరించినట్లు తెలిపాడు. భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిస్పందన లభించలేదని మోడీతో తెలిపినట్లు వివరించాడు. రాజస్థాన్ రాయల్స్, కొల్‌కతా నైట్ రైడర్స్, ఢీల్లీ డేర్‌డెవిల్స్, దక్కన్‌చార్జర్స్, బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ జట్లకు పాక్ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పదకొండు మంది పాక్ ఆటగాళ్లు ఐపిఎల్-1లో పాల్గొన్నారు.
ఆయా జట్ల యజమానులు బిడ్డింగ్‌లో పాల్గొని పాక్ క్రికెటర్లను కొనుగొలు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ, ఉమర్‌గుల్, కమ్‌రాన్ అక్మల్, తన్వీర్ (రాజస్థాన్), మిస్బ ఉల్ హక్ (బెంగళూర్), ఉమర్ గుల్ (కొలకతా), అబ్దుర్ రజాక్ (చార్జర్స్) జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా రు. వీరితో పాటు యువ క్రికెటర్లు సయీద్‌అజ్మల్, మహ్మద్‌ఆమేర్, ఉమర్‌అక్మర్ ఉన్నారు. 2011 ప్రపంచకప్‌కు ముందు ఇరుదేశాల మధ్య సిరీస్ నిర్వహించాలని ఇరుబోర్డులుఆలోచిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో పరిస్థితుల కనుగుణంగా సిరీస్ నిర్వహణ షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నాడు.