హైదరాబాద్, నవంబరు 6, ప్రభాతవార్త క్రీడా ప్రతి నిధి: 55వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్వంలో జరుగుతున్న పోటీలను శుక్రవారం ఫెటరేషన్ కార్యదర్శి కె.రామిరెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 22 జిల్లాల నుంచి బాలబాలికలు పాల్గొన్నారు.
ఈ అంతర్‌జిల్లాల పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యే పిల్లలను జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అండర్ - 17 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాలబాలికల విభాగాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీలు మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగుతాయి. ప్రస్తుత రాష్ట్ర స్థాయిపోటీలకు ఎపిపిఇటి అసోసియేషన్ అధ్యక్షుడు యాదయ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుండగా, తెలంగాణా ప్రాంత ఆర్‌ఐపిఇ విజయరావు అబ్జర్వర్‌గా వ్యవహరిస్తున్నారు.