ముంబై, నవంబరు 6 : సచిన్ చిన్ననాటి రికార్డు బద్దలు కొట్టడమే కాక, జాతీయ రికార్డును తిరగ రాసి వార్తల్లో కెక్కిన సర్ఫరజ్‌ఖాన్ మాస్టర్ బ్లాస్టర్ ను కలవాలని ఉత్సాహపడుతున్నాడు. ముంబైకు చెందిన 12 ఏళ్ల చిన్నారి సర్ఫరజ్‌ఖాన్ అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీల్లో అత్యధిక పరుగులు సాధించి జాతీయ రికార్డు తిరగరాశాడు. ముంబై లోని కుర్లా ప్రాంతానికి చెందిన ఈ బుడతడు హరీస్‌షీల్డ్ అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్లో 421 బంతులు ఎదుర్కొని 56ఫోర్లు, 12సిక్సర్లతో చెలరేగి ఆడి 439 పరుగుల స్కోరు సాధించాడు.
ఈ టోర్నీలో రిజ్వి స్ప్రింగ్ ఫీల్ట్ జట్టుకు ప్రాతిని ధ్యం వహించిన అతను ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీపై ఈ ఘనత సాధించి ఆర్.నాగ్‌దేవ్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. నాగ్‌దేవ్ 1963 -64లో సాధించిన 427పరుగుల వ్యక్తిస్కోరు ఇప్పటివరకు రికార్డు పుటల్లో ఉంది. మూడున్నర దశాబ్ధాల అనంతరం దాన్ని తిరగరాసిన ఖాన్ మరో ఘనత కూడా సాధించాడు. ఇదే టోర్నమెంట్లో 21 ఏళ్ళ క్రితం మాస్టర్‌బ్లాస్టర్ సచిన్‌టెండూల్కర్ అజే యంగా చేసిన 346 పరుగులను అతను అధిగమిం చాడు. 198 ముంబైలోని శ్రద్ధాస్రమ్ విద్యామందిర్ కు ప్రాతినిధ్యం వహించిన సచిన్ తన స్రేహితుడు, మాజీక్రికెటర్ వినోద్‌కాంబ్లీతో కలిసి మూడో వికెట్‌కు 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఏ స్థాయి క్రికెట్‌లో అయినా ఆ వికెట్ ప్రపంచ రికా ర్డు నెలకొ ల్పాడు.
235 పరుగుల వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరు తో గురువారం బరిలోకి దిగిన సర్ఫరజ్ సచిన్ స్కో రును అధిగమించాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ కొనసా గించానన్నాడు. తన తండ్రి కోరికను నిజం చేయ డంతో పాటు జాతీయ రికార్డు సాధించడం ఆనం దంగా మీడియాతో పేర్కొన్నాడు. ఇతని తండ్రి నౌ షన్‌ఖాన్ ముంబైలోక్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుత ముంబై రంజీ ఆటగాళ్లు ఇక్బాల్‌అబ్ధుల్లా, రహిల్‌షేక్‌లతో పాటు ఐపిఎల్-2లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పేసర్ కమ్రాన్ ఖాన్ కూడా నౌషన్ శిష్యుడే కావడం గమనార్హం.
సచినే నా గురువు సచిన్‌టెండూల్కర్ తనకు స్ఫూర్త్తి ప్రధాత అని, తనకు గురవు ఆయనేనని సర్ఫరజ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. సచిన్ సాధించిన దాంట్లో ఒక్క శాతం సాధించగలిగినా తన జీవితం ధన్యమని, అంతటి దిగ్గజంతో తనను పోల్చడం సరికాదన్నా డు. సచిన్‌ను కలిసి మాట్లాడటమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమన్నాడు. తన వయస్సు వారితో కాక సీనియర్లతో ప్రాక్టీస్ చేయడం వల్లే తన కుమారుడు ఈ ఘనత సాధించాడని అతని తండ్రి నౌషన్‌ఖాన్ తెలిపాడు. రాత్రికి రాత్రే తమ కుమారు డు హీరో అయిపోవడం ఆనందంగా ఉందని, అయితే మీడియా సాధించిన దాంతో సంతృప్తి పడనీయకుండా అతని కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించేలా ప్రోత్సహించాలని కోరుతున్నాడు.