|
ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద బాధితుల సహాయార్థం చలన చిత్ర పరిశ్రమ 'స్పందన పేరిట గచ్చిబౌలి స్టేడియంలో 7న స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సిద్ధమవ్ఞతూ హీరో హీరోయిన్లు డాన్స్ రిహార్సల్స్ చేశారు.
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ, సి.కళ్యాణ్, మురళీమోహన్, ఏ.వి.ఎస్. జీవిత, విష్ణు, కామ్నా జఠ్మలానీ, కె.అచ్చిరెడ్డి, మాధవీలత, తనీష్, నాని, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం కోసం పరిశ్రమలోని అన్ని విభాగాల వారు పనిచేస్తున్నారు.
అంతా సిద్ధమైంది. ఖచ్చితంగా 5.45 నిమిషాలకు కర్టెన్ రైజర్‌తో ప్రారంభమవ్ఞతుంది. అనంత్ శ్రీరామ్ రాయగా కీరవాణి ఆలపించిన ఈ పాటలో హీరో హీరోయిన్లందరూ పాల్గొంటారు. ఈ గీతం చక్కటి స్ఫూర్తిమంతమైనది.
ఈ కార్యక్రమం కోసం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న వాళ్ళు కూడా తమ షూటింగులు ఆపుకొని స్టార్ నైట్‌లో పాల్గొనడానికి వస్తున్నారు. ఇందులో 14 మంది సంగీత దర్శకులు, 25 మంది గాయనీ గాయకులు పాటలను ఆలపిస్తారు. 10.15కు గౌరవనీయులైన ముఖ్యమంత్రికి చెక్‌ను అందజేస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నారు.
|