|
'మగధీర సినిమా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొట్టింది. నేటితో వందరోజులు పూర్తిచేసుకుంది.
హీరో రామ్ చరణ్‌తేజ్, దర్శకుడు రాజమౌళి వరల్డ్ ఫిలిమ్ ట్రేడ్‌లో లైమ్‌లైట్‌లో వ్ఞన్నారు. రాజమౌళి సినిమా చెయ్యాలంటే యాభై కోట్లు. రామ్ చరణ్‌తేజ్ చెయ్యాలన్నా యాభై కోట్ల బడ్జెట్ సర్వసాధారణమై పోయింది. అయినా వీరితో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు ఎగబడు తున్నారు. కాల్షీట్లు ఇవ్వడమే తరువాయి. రాజమౌళి తదుపరి అడుగు ఆచితూచి వేస్తుంటే, రామ్ చరణ్ మాత్రం 'బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేద్దామని సెటిలై పోయాడు.
'మగధీర ఇమేజ్‌కి ఏ మాత్రం భంగం కలగకుండా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాలని భాస్కర భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా వ్ఞంటే రాజమౌళితో అర్జంటుగా చిత్రం ప్రారంభించాలని మహేష్‌బాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ఇంతవరకు సినిమా రంగంతో సంబంధం లేని ఒక పొలిటికల్ సెలిబ్రిటి నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే రాజమౌళికి మరో ఛాలెంజ్.
|