|
శర్వానంద్ కథానాయకుడిగా వి.ఆర్.సి మీడియా ఎంటర ్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేవాకట్టా దర్శకత్వంలో రవి వల్లభనేని నిర్మిస్తున్న 'ప్రస్థానం చిత్రం శరవేగంగా జరుగుతోంది.మూడో షెడ్యూల్ పూర్తిచేసుకుది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రవి వల్లభనేని మాట్లాడుతూ 'కొడైకెనాల్‌లో నాలుగు రోజుల పాటు శర్వానంద్, రూబీ పరిహార్‌పై ఓ యుగళగీతాన్ని చిత్రీకరించాం అన్నారు. దర్శకుడు దేవాకట్టా మాట్లాడుతూ 'ప్రస్థానం పాటల్లో సంగీతానికి, సాహిత్యానికి మంచి ప్రాధాన్యతనిచ్చాం. వనమాలి, చైతన్యప్రసాద్ చక్కటి సాహిత్యాన్ని అందించారు.
సంగీత దర్శకుడు మహేష్‌శంకర్ అద్భుత మైన బాణీలను అందించాడు. ఈ చిత్ర ఆడియో ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను అన్నారు. సాయికుమార్, సందీప్‌్‌కిషన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహేష్‌శంకర్, కెమెరా: శామ్‌దత్, సమర్పణ: వల్లభనేని రోశయ్య, నిర్మాత: రవి వల్లభనేని, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.
|