మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   17th 2010 - 7:47 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
తగ్గనున్న నూనెగింజల ఉత్పత్తి
శని వారం, నవంబర్ 07, 2009 , 12:09 [IST]

seedsముంబయి నవంబర్‌ 5:- ఈసంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో రుతుపవనాలు జాప్యం కావడం, తర్వాత వరదలు రావడం వల్ల నూనె గింజల ఉత్పత్తి తొమ్మిది శాతం పడిపోవచ్చునని అంచనా. విస్తీర్ణం తగ్గడమేకాకుండా దిగుబడి కూడా తగ్గింది. విస్తీర్ణం ఐదు శాతం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. సాల్వేంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆదివారం నాడు ఇండోర్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో నూనెగింజల దిగుబడి 15.03 మిలియన్‌ టన్నుల నుంచి 13.65 మిలియన్‌ టన్నులకు పడిపోతుందని అంచనా. ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో 62 శాతం జరుగుతుంది.

తవుడు నుంచి తీసే నూనె ఉత్పత్తి కూడా 50వేల టన్నులు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే పత్తిరంగంలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. పత్తి ఉత్పత్తి ఆరు శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. 2008-09 సంవత్సరంలో 288 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే ఈ సంవత్సరం 305 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కావచ్చునని అంచనా. దేశంలో బిటి కాటన్‌ విస్తీర్ణం గత సంవత్సరం 65 శాతం ఉంటే ఈ సంవత్సరం 87 శాతం ఉంది. పత్తి గింజల ఉత్పత్తి 8.93 మిలియన్‌ టన్నుల నుంచి 9.46 మిలియన్‌ టన్నులకు చేరునున్నది.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
  విద్యుదుత్పత్తిల్లో పవర్‌..
 ఆరేళ్లలో 75% పెరిగిన బంగారం విలువ
 ఇరాక్‌లో స్టీల్‌ ప్లాంట్‌
 రేవుల్లో గుత్యాధిపత్య నివారణ
 పెరిగిన ఫ్రిజ్‌, ఎసిల ధరలు
 పెరిగిన టాటా అమ్మకాలు
 అతిఖరీదైన గడియారం
 పల్లె పల్లెకు గ్యాస్‌ ఏజెన్సీలు
 వినియోగదారుల హక్కుల వారోత్సవాలు
 కింగ్‌ఫిషర్‌ నుంచి అంతర్జాతీయ..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com