న్యూఢిల్లీ నవంబర్ 6:- భారతీయ పౌర విమాన సంస్థలలో విదేశీ విమాన సంస్థలు 49 శాతం వాటాలను తీసుకోవడానికి అనుమతించాలన్న ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆమోదముద్ర లభిస్తే ప్రస్తుతం నష్టాలతో నడుస్తున్న పౌరవిమానయాన సంస్థలకు ఊపిరి పోసినట్లు అవుతుంది. అయితే ఈప్రతిపాదనకు అతిపెద్ద ప్రయివేటు విమాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తున్నది. కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడిని పెంచడంపై నిర్ణయించేందుకు క్యాబినెట్‌సెక్రటరీ కెఎమ్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసారు.
పౌరవిమానయాన సంస్థల్లో 49 శాతం విదేశీ విమాన సంస్థలు ప్రత్యక్ష పెట్టుబడి అను మతించే అంశాన్ని నవంబరు 17న జరిగే ఈ కమిటీ సమావేశంలో పరిశీలిస్తారు. ప్రస్తుతం భారతీయ విమాన సంస్థల్లో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతి ఉంది. అయితే విదేశీ విమాన సంస్థలు ప్రత్యక్షంగాని, పరోక్షంగా గాని ఇలా పెట్టు బడి పెట్టడాన్ని అనుమతించరు. అయితే 25 శాతం పెట్టుబడికి తొలిదశలో అనుమతించాలని పౌర విమానయాన శాఖ కోరుతుంది. అయితే 26 శాతం వాటాలను విదేశీ ప్రయివేటు విమాన సంస్థలకు అందించే విషయంపై పౌరవిమానయాన శాఖ మౌనంగా ఉంది. 26 శాతం వాటా ఉంటే విదేశీ విమాన సంస్థలకు దేశీయ విమాన సంస్థల యాజమాన్యంలో పట్టు లభిస్తుంది.
అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ మాత్రం 49 శాతం విదేశీ విమాన సంస్థల పెట్టుబడులను అనుమతించవచ్చునన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఈ పరిధిలోకి వస్తుంది. అంటే సాంకేతికంగా ఎయిర్ ఇండియాలో కూడా విదేశీ విమాన సంస్థలు 49 శాతం వాటాలు పెట్టవచ్చు. అయితే ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించే ఆలోచన గాని, విదేశీ భాగస్వామిని అనుమతించే అవకాశం గాని లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పలు దేశీయ విమాన సంస్థలు విమాన ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోవడంతో నష్టాల బాట పడ్డాయి. 2009 సెప్టెంబరుతో అంతమైన రెండో త్రైమాసికంలో జెట్‌ఎయిర్‌వేస్‌కు రూ.406 కోట్లు, కింగ్‌ఫిషర్‌కు రూ.418 కోట్లు, స్పైస్ జెట్‌కు రూ. 101 కోటి నష్టాలు వచ్చాయి. కింగ్‌ఫిషర్ విమాన సంస్థ యజమాని విజయమాల్యా ఇటీవల ఆర్థిక మంత్రిని కలిసి తమ కంపెనీ నష్టాల గురించి వివరిం చారు. అయితే వారిద్దరి మధ్య చర్చ ఏమి జరిగిందో తెలియదు. పలు విదేశీ విమాన సంస్థలు కింగ్‌ప ¶ిషర్‌లో వాటాలు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నా యి. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలను అనుమతిస్తే పలు భారతీయ విమాన సంస్థలు క్రమంగా విదేశీ కంపెనీల ప్రభావంలో పడతాయి.