మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
జిఎస్‌ఎమ్‌ నెట్‌వర్క్‌కు మెగా టెండర్‌
శని వారం, నవంబర్ 07, 2009 , 11:58 [IST]

businessత్వరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌ కసరత్తు
న్యూఢిల్లీ నవంబర్‌ 6:-
ప్రభుత్వరంగ బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ 93 మిలియన్‌ లైన్ల జిఎస్‌ఎమ్‌ నెట్‌వర్క్‌ను రూ. 32వేల కోట్లతో విస్తరించడానికి టెలికామ్‌ పరికరాలను సరఫరా చేసే ఎరిక్సన్‌, హువే కంపెనీలతో మంతనాలు జరుపుతున్నది. ఈ పరికరాల వెండార్లు త్వరితంగా వీటిని సరఫరా చేసే విధంగా ఏర్పాటు చేస్తామని, ఒకటి రెండు వారాల్లో ఈ సరఫరాపై నిర్ణయం జరుగుతుందని బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి కుల్‌దీప్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఈ రూ.32వేల కోట్ల టెండర్లను తిరిగి పిలిచే అవకాశం కూడా ఉన్నదని గోయల్‌ స్పష్టం చేసారు. ప్రస్తుత వెండార్లు సరసమైన ధరలకు ఈ పరికరాలను సరఫరా చేస్తే మళ్ళీ టెండరింగ్‌ ప్రక్రియ ఉండబోదని అన్నారు.

ప్రస్తుతం బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎరిక్సన్‌, హువే అందచేసిన బిడ్‌లను మాత్రం పరిశీలిస్తున్నది. నోకియా, సీమెన్స్‌, జెట్‌టిఇ, ఆల్కా టెల్‌ లుసెంట్‌ వంటి వెండార్ల బిడ్‌లను తిరస్క రించింది. అయితే ఇప్పటికీ బిఎస్‌ఎన్‌ఎల్‌ అడ్వాన్సు పర్చేజ్‌ ఆర్డర్లను జారీ చేయలేదు. బిఎస్‌ఎన్‌ఎల్‌ తమ బిడ్‌లను తిరస్కరించడాన్ని నోకియా, సీమెన్స్‌ కోర్టులో సవాళ్లు చేసాయి. ఈ వివాదంపై కోర్టులు తుది నిర్ణయం ఇవ్వాల్సి ఉంది. ప్రతి ప్రాంతంలోనూ ఒక్కో వెండార్‌ను ఎంపిక చేయడంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ పారదర్శకత పాటించడం లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాము కాంపిటిటీవ్‌ బిడ్డింగు పద్ధతిని అనుసరించామని, అందువల్ల వెండార్లు ఇచ్చిన కొటేషన్‌లు పోటీ మీద ఆధారపడి ఉన్నాయని బిఎస్‌ఎన్‌ఎల్‌ అభిప్రాయపడుతున్నది.

ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు మండలాల్లో 93 మిలి యన్‌ల జిఎస్‌ఎమ్‌ నెట్‌వర్క్‌లైన్లు ఏర్పాటు చేయడానికి గత సంవత్సరం బిఎస్‌ఎన్‌ఎల్‌ టెండ ర్లను పిలిచింది. కంపెనీలు అందచేసిన సాంకేతిక బిడ్‌లను పరిశీలించిన తర్వాత ఎరిక్సన్‌ కంపెనీని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు, హువే కంపెనీని దక్షిణ ప్రాంతానికి ఎంపిక చేసారు. నోకియా సీమెన్స్‌ సమర్పించిన మెగా టెండర్‌లో కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆ టెండర్‌ను తిరస్కరించింది. ఈ వివాదం ఛీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై కమిషనర్‌ ఇద్దరు సభ్యుల బృందాన్ని ఈ వివాద పరిశీలనకు ఏర్పాటు చేసారు.

ఈ బృందం బిఎస్‌ఎన్‌ఎల్‌ లోపం ఏదీ లేదని నిర్దారించింది. జమ్మూ కాశ్మీర్‌లో మార్పులు ఇది ఇలావుండగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో ప్రీపెయిడ్‌ మొబైల్‌ కనెక్షన్‌ ఇవ్వడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీనితో బిఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్రీపెయిడ్‌ కనెక్షన్‌లన్నీ పోస్టుపెయిడ్‌ కనెక్షన్‌లుగా మారుస్తున్నది. రెండు రోజుల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఐదు నుంచి ఆరు లక్షల దరఖాస్తులను పంపిణీ చేసి మార్పులు చేయాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో ఈ సంస్థకు ఏడు లక్షల ప్రీపెయిడ్‌ మొబైల్‌ కనెక్షన్లు, ఒకటిన్నర లక్షల పోస్టుపెయిడ్‌ కనెక్షన్లు ఉన్నాయి. మొబైల్‌ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు వినియోగదారులు ఎవ్వరైనా ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఈ తీవ్రమైన చర్యకు పాల్పడింది.

బిఎస్‌ఎన్‌ఎల్‌ పర్‌ సెకండ్‌ బిల్లింగ్‌

ప్రభుత్వరంగ భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పర్‌సెకండ్‌ బిల్లింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనితో ఇప్పటికే ఇటువంటి టారిఫ్‌ స్కీము నిర్వహిస్తున్న ఇతర కంపెనీల జాబితాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చేరినట్లు అయింది. కొత్త బిల్లింగ్‌ పద్ధతి ప్రకారం బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో వినియోగదారుడు సెకండ ్‌కు ఒక పైసా చొప్పున ఎస్‌టిడి కాల్స్‌ చేయవచ్చు. ఈ విషయాన్ని బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి కుల్‌దీప్‌ గోయల్‌ చెప్పారు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా నిమిషానికి 49పైసల టారిఫ్‌తో బిల్లు చేసే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. నిమిషానికి 40 పైసల స్కీము వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని గోయల్‌ భావిస్తున్నారు. అలాగే 3జి సర్వీసులకు కూడా బిఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ టారిఫ్‌ ఉండే ప్రణాళికను ప్రకటించింది.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 విద్యుత్‌ కొరతతో ఐటి కంపెనీలకు..
 ఎన్‌ఎమ్‌డిసి స్పందన అంతంత మాత్రమే
 డిజిన్వెస్ట్‌మెంట్‌కు స్పందన..
 లండన్‌లో మీడియా సెంటర్‌
 సిమెంటు ధర పెరిగే అవకాశం
 రానే-టిఆర్‌డబ్ల్యు కొత్త యూనిట్‌
 పొరుగు దేశాలకు ఎరువుల రవాణా
 అస్సాం గ్యాస్‌కు కాగ్‌ అక్షింతలు
  హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ రెండో ప్లాంట్‌
 హైదరాబాద్‌కు ఆరో స్థానం
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com