| సోనియా దృష్టికి గ్రేటర్ గొడవ: కెకె |
| శని వారం, నవంబర్ 07, 2009 , 11:45 [IST] |
 |
|
న్యూఢిల్లీ, నవంబరు6, ప్రభాతవార్త: గ్రేటర్ గొడవ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్లు రాజ్యసభ సభ్యుడు, ఏఐసిసి అధికార ప్రతినిధి కే.కేశవరావు చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అందర్నీ సంతృప్తి పర్చటం సాద్యం కాదన్నారు. అలాగని ఇళ్లమీద దాడులు, నేతల్ని నిలదీయటం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమన్నారు. వీటిపై ఏమాత్రం ఉపేక్షించటం తదని అహ్మద్‌పటేల్‌కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా చేస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిం చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ టిక్కెట్లను పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్, మంత్రి దానం నాగేందర్ అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
|
|
|
|
|
|
|