| అవసరమైతే పిఆర్‌పి మద్దతు తీసుకుంటాం: విహెచ్ |
| శని వారం, నవంబర్ 07, 2009 , 11:42 [IST] |
 |
|
ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల తర్వాత అవసరమైతే మేయర్ ఎంపిక కోసం ప్రజారాజ్యం పార్టీ మద్దతు తీసుకుంటామని రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు మీడీయాకు తెలిపారు.
సీట్ల కేటాయింపులో వస్తున్న ఆరోపణలతో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు, దానం నాగేందర్‌లకు ఎలాంటి సంబంధం లేదని వీహెచ్ అన్నారు. గాంధీభవన్‌పై దాడి కాంగ్రెస్ కార్యకర్తల అత్యు త్సాహం మాత్రమేనని తెలిపారు. కార్యకర్తలు ఒక రాయి వేస్తే, పది రాళ్ళు వేసినట్లు మీడియా ప్రసారం చేస్తుందని తప్పుపట్టారు.
|
|
|
|
|
|
|