సోనియా నిర్ణయం శిరోధార్యం : రోశయ్య న్యూఢిల్ల్లీ, నవంబరు 6, ప్రభాతవార్త: జగన్ సిఎంకావాలని కొంతమంది నేతలు, కార్యకర్తలు ఉత్సాహం చూపారు. అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా ముం దుకు దూకారు. జగన్ సిఎం కావాలని అనుకోవటాన్ని నేను తప్పు పట్టను. రేపు మా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తున్నాను. మీరు ముఖ్య మంత్రి పదవి నుంచి తప్పుకోండి అని సోనియా అంటే అరనిమిషంలోనే సంతోషంగా తప్పుకుంటాను అంటూ తొలి పర్యటనలోనే ముఖ్యమంత్రి రోశయ సంచలనవ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్ర వారం రాత్రి హస్తినకు వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్పమొయిలీ నివాసానికి వెళ్లారు.
సుమారు 45నిమిషాల పాటు మొయిలీతో రాష్ట్రరాజకీయాలపై చర్చించారు. శనివారం సోనియాతో ఏఏ అంశాలపై మాట్ల్లాడాలో కూడా చర్చించినట్లు సమాచారం. మొయిలీని కలిసిన అనంతరం అక్కడే సిఎం రోశయ్య విలేకరులతో మాట్లా డారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎంత అండదండగా ఉందో రోశయ్య ముఖం చూస్తే స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయానికి కట్టుబడి ఉం డాల్సిందే నేనా జగనా ఇంకా ఎవరైనాసరే. సోనియా ఆదేశాలను తాను శిర సావహిస్తానని రోశయ్య చెప్పారు. పార్టీలో సైనికుడిలా తాను పనిచేస్తున్నాని మరోమారు స్పష్టం చేశారు.
గ్రేటర్ ఎన్నికలపై మొయిలీతో చర్చించామని, విజయం సాధించటమే ధ్యేయంగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో వత్తిడి తీవ్రంగా ఉంటుందని, ఎంఎల్‌ఏలు, ఎంపీల అబిప్రా యాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని సర్ధుబాటు చేసుకుంటామనిచెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో డబ్బులకు టిక్కెట్టు అమ్మకున్నారనే ఆరోపణలపై ఖండించారు. జలయజ్ఞంపై కొండా సురేఖ వ్యాఖ్యలకు బజారులోనిలబడిసమాధానంఇవ్వబోననిస్పష్టం చేశారు.