మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
సిబిఐ దర్యాప్తు వేగవంతం
శని వారం, నవంబర్ 07, 2009 , 11:31 [IST]

ఆ రెండు గంటలు బాటియా ఎక్కడ?
ప్రభాతవార్త - ఆత్మకూరు  :
  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న బెల్‌ హెలికాప్టర్‌ కూలి ఆయనతో పాటు సహచరులు మృత్యువాతపడిన సంఘ టనపై సిఐడితో మొదలు పెట్టిన పరిశో ధన సిబిఐ చేతికి చేరింది. సిబిఐకి కొన్ని ప్రభుత్వ సంస్థల నుంచి సహ కారం అందక పోవడంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్న దర్యాప్తు 59 రోజులు పూర్తయినా ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన బెల్‌ హెలికాప్టర్‌ నుంచి చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రో ల్‌కు సంబంధాలు తెగిపోయిన అంశా లు చివరిసారిగా పైలట్‌వారితో ఏమైనా సంభాషించారా అనే విషయాలు ఇప్ప టికీ సిబిఐకి చేరలేదని తెలిసింది.

ఈ విషయమై 40 రోజుల కిందటే సిబిఐ నోటీసులందుకున్నప్పటికీ చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు ఏ మాత్రం స్పందించనట్లు తెలుస్తోంది. ఈ సారి వారి నుంచి నిర్బంధాంగానైనా సమాచారాన్ని పొందేందుకు సిబిఐ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపిం చాలన్న శ్రద్ధతో దర్యాప్తు సంస్థలు వైఎస్‌ రాజశేఖరరెడ్ది డిఎన్‌ఎ నమూనాలు సేకరించినట్లు తెలుస్తోంది. వీటిని ముఖ్య మంత్రి సంతానం డిఎన్‌ఎతో సరిపోల్చ నున్నారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గాలిలో ఎగిరే విమా నాలు, హెలికాప్టర్లకు సిగ్నల్స్‌ను స్థంబింప చేసి వాటిని నేల కూల్చే ఈ - బాంబ్‌ ప్రయోగంపై కూడా సిబిఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 బాటియా ఎక్కడ...
 సెప్టెంబర్‌ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం చేసిన బెల్‌ హెలికాప్టర్‌ ఫైలట్‌ బాటియా ప్రయాణానికి ముందు రెండు గంటల సేపు ఏమి చేశాడు. ఎక్కడ వున్నాడు. అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన రోజున ఫైలట్‌ బాటియా తన ఇంటి నుంచి ఉదయం 5.30 గంటలకు బయటకు వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో బేగంపేట విమానాశ్రయానికి 20 నిమిషాల ప్రయాణ దూరం ఉంటుంది. అయితే ఆయన ఆ రోజు 7.30 గంటలకు హెలికాప్టర్‌ వద్దకు చేరుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన 100 నిమిషాల్లో ఆయన జరిపిన కార్యకలాపాలు, కలిసిన వ్యక్తుల గురించి దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com