మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం మార్చి   16th 2010 - 2:11 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
'గ్రేటర్‌ టిక్కెట్లు అమ్ముకున్నారంటూ నేతలపై దుమ్ము
శని వారం, నవంబర్ 07, 2009 , 11:13 [IST]

pranteeyaకాంగ్రెస్‌లో కల్లోలం
డిఎస్‌ నివాసం ఎదుట ధర్నాలు, నినాదాలు పదవికి నాగేందర్‌ రాజీనామా నాయకులను వెంటాడి తరిమిన కార్యకర్తలు
ప్రభాతవార్త ప్రత్యేకప్రతినిధి హైదరాబాద్‌ :
గ్రేటర్‌ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు కాంగ్రెస్‌ పార్టీలో మంటలు రేపింది. మొత్తం 32డివిజన్లకు సంబం ధించి ఎంతో కాలంగా టిక్కెట్లు ఆశిస్తున్నవారికి రిక్త హస్తాలు మిగలడంతో ఆశావహులు, వారి అను యాయులు గాంధీ భవన్‌వద్ద, పిసిసి అధ్యక్షుడు డిశ్రీనివాస్‌ నివాసం ఎదుట, గ్రేటర్‌కాంగ్రెస్‌ అధ్య క్షుడు డి.నాగేందర్‌ ఇంటివద్ద గత అర్ధరాత్రి నుంచే తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చసాగారు. టిక్కెట్ల లొల్లి గ్రేటర్‌ అధ్యక్షపదవికి నాగేందర్‌ రాజీనామా చేసే వరకు వెళ్ళింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్డెక్కి పర స్పరం నిందించుకున్నారు.

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగడమేకాక ఆయన్నుకొంత దూరం తరముకుంటూ వెళ్లి ఆయనై దాడికి ఉపక్రమిం చారు. ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే అయితే పరస్పరం దూషించుకునేవరకు వెళ్లింది. కొందరు నాయకులైతే అభ్యంతరకర పదజాలం ఉపయోగించుకున్నారు.  ఢిల్లీకి వెళ్లేముందు ముఖ్యమంత్రి రోశయ్య విలేఖరు లతో మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, రోడ్లెక్కి పార్టీ పరువు ప్రతిష్ఠలను బజారుపాల్జేయవద్దని కోరారు.

pranteeyaడిఎస్‌ ఇంటి ఎదుట కొందరు కార్యకర్తలైతే ఒంటిపై పెట్రోలుపోసుకుని ఆత్మాహుతి ప్రయత్నం వరకు వెళ్ళారు. నాగేందర్‌ డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేయడంతో ఆయన మనస్తాపం చెంది  శుక్రవారం ఉదయమే పిసిసి అధ్యక్షుని ఇంటికి వెళ్లి గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను ఆయ నకు అందజేశారు.

రాజీనామా చేసినట్లు నాగేందర్‌ చెప్పారు కానీ దాని ఆమోదం విషయమై నాగేందర్‌ కానీ, పిసిసి వర్గాలు కానీ నిర్ధారించలేదు. రంగా రెడ్డిజిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూడా టిక్కెట్లు విక్రయించుకోవడంలో మినహాయింపుకాదని, కాంగ్రె సేతర పార్టీల వారినుంచి సొమ్ముతీసుకుని టిక్కె ట్లిప్పించారని అభియోగం మోపారు. పార్టీ కోసం అహరహం పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం చేసి టిక్కెట్లు కేటాయించి సొమ్ముచేసుకున్నారని డిఎస్‌పై కూడా నిందలు మోపారు.

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7గంటలవరకు గ్రేటర్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు వాహనాలపై డిఎస్‌ ఇంటివద్దకు చేరుకుని ఆరోపణల వర్షం కురిపిస్తునే ఉన్నారు. దిివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ నాయకత్వంలో గ్రేటర్‌ ఎన్నికలపై ఆశలు పెంచుకుని దాదాపు 10 నెలలకు పైగా పార్టీకోసం కష్టించి, సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ విజయానికి తమవంతు కృషిచేసి గతంలో ఎన్నడూలేనట్లు గ్రెేటర్‌ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ విజయపతాకను ఎగురవేసిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు గురువారం రాత్రి అభ్యర్ధుల జాబితా నిరాశ మిగిల్చింది.

గ్రేటర్‌ టిక్కెట్ల కేటాయింపునకు వైఎస్‌ ఎన్నో శాస్త్రీయ విధానాలు అవలంబించి దాదాపు నాలుగు విడతల్లో సర్వేలు జరిపి కొందరు మంత్రులతో వడపోత కమి టీని నియమించగా, తీరా ఎన్నికలొచ్చేసరికి వైఎస్‌ అకస్మిక మరణం వల్ల మొత్తం ప్రక్రియ తలక్రిం దులై అసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యేలుభిక్షపతియాదవ్‌,బి.రాజిరెడ్డి,టి.మణెమ్మసుధీర్‌రెడ్డి, పి.శంకరరావు, కె. శ్రీశైలంగౌడ్‌, ఆకుల రాజేందర్‌, మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌, కూకట్‌పల్లి నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు వడ్డేపల్లి నర్సిం గరావు తదితరులు పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిక్కెట్ల లొల్లి ముఖ్యంగా మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, శేరిలింగంపల్లి, కాప్రా, మారేడ్‌పల్లి, సికిందరాబాద్‌, ముషీరాబాద్‌, కూకట్‌పల్లి    సర్కిళ్లలోని 32 డివిజన్ల టిక్కెట్ల కేటాయింపులో అక్రమాలుజరిగాయని ఆరో పణలు తలెత్తాయి. మంత్రి నాగేందర్‌ విపరీత జోక్యం వల్లనే గ్రేటర్‌లో అసలైన నాయకులకు టిక్కెట్లులభించలేదని, ఆయన హస్తలాఘవం వల్లనే చివరి నిమిషంలో పేర్లు తారుమారయ్యాయని, ఇం దులో డబ్బు కీలక పాత్ర పోషించిందని, అందుకు నాగేందర్‌తోపాటు పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్‌ది కూడా అంతే బాధ్యత అని కూన మణెమ్మ, రాజి రడ్డి, భిక్షపతి అన్నారు. వైఎస్‌ ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేదికాదని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సంవాదం ఎంపి సర్వే సత్యనారాయణ ఎమ్మెల్యే డి సుధీర్‌రెడ్డిమధ్య మరింత తీవ్రస్థాయిలో చోటు చేసు కుంది.వందలాదికార్యకర్తలుడిఎస్‌ఇంటిఎదుట గుమి గూడి ఉన్న సమయంలో డిఎస్‌తో మంతనాలు జరుపుతున్న నేతలిరువురిమధ్య మాటామాటా పెర గగా, ఆవేశంలోసత్యనారాయణ,సుధీర్‌పట్ల అసభ్య పదజాలం ఉపయోగించగా, అందుకు ఆయన ఆగ్ర హించి ఎంపిపైకి కుర్చీ ఎత్తారని తెలిసింది. ఇం తలో పక్కనున్నవారు వారిరువురినీ శాంతింపజ ేశారు. కొంతసేపటికి బయటకువచ్చిన నాయకులిరు వురూ, తాము ఆవేశంలో తొందరపిడిన మాట నిజ మేనని, టిక్కెట్ల అంశంలో ఇటువంటి సంఘటనలు సహజమని సర్దుకున్నారు.అందరూ అధిష్ఠానం నిర్ణ యానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు.

అదేమాదిరి మారేడ్‌పల్లి డివిజన్‌లో ఎమ్మెల్యే శం కరరావు తమకు టిక్కెట్టు రాకుండా అడ్డుకున్నారని, ఆయన కుమార్తెకోసం పైరవీసాగించడంలో తమకు అన్యాయం జరిగిందని మాజీ కార్పొరేటర్‌ వసంత రావు ఆరోపించారు. నీకుటుంబంలో ఎందరు ప్రజా ప్రతినిధులున్నారు, ఇంకెంతమందికి టిక్కెట్లు కావాలి  అని నిలదీయగా అందుకు శంకరరావు అభ్యంతరం చెప్పారు.  టిక్కెట్లలో తనదే మాత్రం జోక్యం లేదన్నారు. శంకరరావుకూడా అదేస్థాయిలో వారితో పావుగంటపైగా వాగ్వివాదానికిదిగారు. పరి స్థితి ముదిరి మాజీ కార్పొరేటర్‌ అనుయాయులు, శంకరరావుపైకి దాడికి ప్రయత్నించారు. ఆయన్ను నెట్టుకుంటూకొంతదూరంవెళ్ళిఅక్కడనుంచి దాదాపు తరిమి కొట్టినంత పనిచేశారు.  ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను పోలీసు వాహనంలో అక్కడినుంచి తప్పించి ఆ తరువాత ఆయన సొంత వాహనంలో ఎక్కించి పంపి వేశారు.

మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కొద్ది సేపు డిఎస్‌తో మంతనాలు జరిపి బయటకు వచ్చి అంబర్‌పేట నియోజకవర్గంపరిధిలోనిడివిజన్లలో కాంగ్రెస్‌ నాయ కులు పెద్దమొత్తాలకు టిక్కెట్లు అమ్ముకున్నారని అభియోగించారు. తమ ప్రత్యర్ధులు తమవారికి టిక్కెట్లురాకుండా అడ్డుకున్నారని పరోక్షంగా విహెచ్‌ అనుయాయులపై అరోపణలు సంధించారు. తానా విషయాన్ని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని తెలి పారు. రంగారెడ్డి డిసిసి అధ్యక్షుడు కె ఎం ప్రతాప్‌ తెలుగుదేశం  నాయకులతో కుమ్మక్కయి ప్రత్యర్ధుల గెలపునకు సహకరించే విధంగా కాంగ్రెస్‌ తరఫున డమ్మీలను నిలిపారని, అందుకు ఆయనకు బాగా డబ్బు ముట్టిందని కాంగ్రెస్‌ అసోసియేటెడ్‌ ఎమ్మెల్యే కె శ్రీశైలంగౌడ్‌ అరోపించారు.  ఇదేవిధంగా 123 డివిజన్‌లో 'మనపార్టీ నాయకునికి కె ఎం ప్రతాప్‌ సొమ్ము తీసుకుని టిక్కెట్టింపించారని ఆరోపిస్తూ దాదాపు 50 మంది మహిళలు డిఎస్‌ ఇంటి వద్ద ధర్నా చేశారు. 125 డివిజన్లో మైనారిటీలకు అన్యా యం జరిగిందని దాదపు పాతికమంది ముస్లింలు డిఎస్‌ ఇంటి ఎదుట వివాదాలు చేశారు.

ఎంపి సర్వే, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి  ఆ తరువాత విలేఖరులతో మాట్లాడుతూ టిక్కెట్లప్పుడు ఇటు వంటి ఆగ్రహాలు సహజమేనని, ఆవేశకావేషాలు, ఆరోపణలు,నిందలుమామూలేనంటూ ఒకటి రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్నారు. తమకు ఒక రిపై ఒకరికి ఎటువంటి ద్వేషభావం లేదని సంజా యిషీ ఇచ్చుకున్నారు. తామంతా అధిష్ఠానం నిర్ణ యాన్ని శిరసావహిస్తామని తెలిపారు. నాగేందర్‌ స్పందిస్తూ తనపై అటువంటి నిందలు రావడం మనస్తాపం కలిగించిందని, రాజకీయాల్లో కార్యకర్త స్థాయినుంచి అందరి విశ్వాసం సంపాదించి ఈ స్తాయికి ఎదిగాననిఅన్నారు. తనకు టిక్కెట్లు అమ్ము కునే అవసరం లేదని, ఇదే నిరూపిస్తే తాను రాజకీ యాలనుంచి తప్పుకుంటానని సవాలు చేశారు.

ఉద యం నుంచి సాయంత్రం వరకు ఒక వైపు ఉద్రిక్తత కొనసాగుతున్నా, పిసిసి అధ్యక్షుడుశ్రీనివాస్‌ తనను కలవడానికి వచ్చిన వారిని ఎమ్మెల్యేలు, ఎంపిలను విడివిడిగా కలుసుకుని వారితోమాట్లాడివారిని సము దాయించి పంపివేశారు. సాయంత్రంమంత్రి బొత్సా డిఎస్‌ ఇంటికి వచ్చి ఆయనతో అరగంటకుపైగా రహస్యంగా మంతనాలు జరిపారు. టిక్కెట్లప్పుడు కార్యకర్తల్లో ఆగ్రహం సహజమని రెండ్రోజుల్లో అం తా సర్దుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా డిఎస్‌కు మద్దతుగా కార్యకర్తలు బృందా లుగా అక్కడికి చేరుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

డిఎస్‌ నివాసం వద్ద హడా విడితో ఉదయంనుంచి పలు చానళ్లు, పత్రికలకు చెందిన విలేఖరులు, ఫొటోగ్రాఫర్లు వందల సం ఖ్యలో చేరుకున్నారు. వీరిని చూడగానే ప్రదర్శకులు మరింత రెచ్చిపోయిహంగామా సృష్టించారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హంగాఆమాతో ఎమ్మెల్యే కాలనీవాసులు ఉద యం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. గాంధీ భవన్‌ వద్ద ఉదయం దాదాపు 50 మంది కార్యకర్తలు చేరి గన్‌ఫౌండరీ డివిజన్‌ టిక్కెట్‌ కేటాయింపులో అన్యాయం జరిగిందని నినాదాలు చేశారు. వారిలో మాజీ కార్పొరేటర్‌ అనుయాయు డొకరు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అంటించు కునేందుకుప్రయత్నించగా పోలీసులు నివారించారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 కోనేరు కన్నుమూత
 చేనేత రుణమాఫీ17న అసెంబ్లీలో ప్రకటన
 గొంతులెండుతున్నాయే
 ఎస్‌ఎస్‌సికిఏర్పాట్లు పూర్తి
 'వార్త 'వికృతి నామ సంవత్సర ఉగాది..
 96 మున్సిపాలిటీలలో మంచినీటి..
 హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఎఫ్లూ..
 సిపిపి కోశాధికారిగా..
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com