కుటుంబ సభ్యుల ఆరోపణ హైదరాబాద్ నవంబర్4, ప్రభాతవార్త సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లాల్‌బహద్దూర్ (ఎల్‌బి) స్టేడి యంలో గల వసతి గృహంలో సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి ఎస్.అమరావతి అలియాస్ సునీత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, ఆమెపై విషప్రయోగమేమైనా జరిగిందా? లేక విషపు మాత్రలేమైనా మింగి ఆత్మహత్య చేసు కుందా? అన్నది తెలాల్సి ఉంది. బుధవారం ఉద యం జాగింగ్‌కు రాకపోవడంతో తోటి క్రీడాకారి ణిలు ఆమె గదికి వెళ్లి తలుపులను ఎంత తట్టినా తెరువలేదు.బలవంతంగా తలుపులను తెరిచి చూడటంతో ఆమె మృతి విషయం వెలుగుచూ సింది. ఆమె గదిలో పేయిన్‌కిల్లర్ మాత్రలు, ఇతర మాత్రలతోపాటు ఆమె సెల్‌ఫోన్‌ను కూడా సైఫాబాద్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
కాగా, మంగళవారం తామంతా కలిసి బిర్యానీ తిన్నామని, రాత్రి ఎవరి గదికి వారు వెళ్లి నిద్రకు ఉపక్రమించామని ఇతర క్రీడాకారిణిలు పోలీసు లకు తెలిపారు. ఆమె గదిలో ఉన్న మరో బాక్సింగ్ క్రీడాకారిణి ఐదు రోజుల క్రితమే స్వగ్రామానికి వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో ఆమె మృతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసులకు చిక్కలేదు. సమాచారం అందు కున్న క్రీడల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఫరీడా, శాప్ ఛైర్మన్ రాధ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెకు కోచ్‌గా ఉన్న ఓం కార్ యాదవ్ వేధింపులకు గురించేయడంతోనే సునీత ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడి ఖైరతాబాద్‌లోని చిం తలబస్తీ, బుడగజంగంబస్తీకి చెందిన ఆమె నాలుగున్నరేళ్ల నుంచి పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొని ఐదు మెడ ల్స్‌ను సాధించింది.
మూడున్నర సంవత్సరాలనుంచి స్టేడియంలోని రెండవ అంతస్తులోగల హాస్టల్ గదిలో ఉంటుందని, కోచ్‌వేధింపులగూర్చి ఆమె కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా తన దృష్టికి తేలేదని శాప్ చైర్మన్ రాధ తెలిపారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ హించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైనా బాధ్యులుగా తేలితే తప్పకుండా వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని మధ్య మండలం డీసిపి హరికుమార్ తెలిపారు. కాగా పోలీసుల దర్యాప్తులో ఆమె సెల్‌ఫోన్‌నుంచి మంగళవారం రాత్రి చివరిగా మరో బాక్సర్ చెన్నకేశవ్‌తో మాట్లా డినట్లు తెలిసింది. పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.