మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఫోన్లో చిరు మంతనాలు
గురు వారం, నవంబర్ 05, 2009 , 10:17 [IST]

chiranjeeviపొత్తుపై పిఆర్‌పిలో ఆరని ఆశలు
 హైదరాబాద్‌, నవంబర్‌ 4,ప్రభాతవార్త :
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం ఫోన్‌లో మంతనాలు జరిపి నట్లు తెలిసింది. పొత్తులపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పిఆర్‌పి వర్గాలను శాంతపరిచే కార్యక్రమంలో కాం గ్రెస్‌ నాయకులు సఫలీకృతులయ్యారు. దీంతో కొంత మేర శాంతించిన చిరంజీవి జాతీయ స్థాయి కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరిపారు.

కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర పార్టీ అధినేత, ఇతర ముఖ్యులు పొత్తులకు సానుకూలంగా ఉండగా ఒక వర్గం మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్న విషయం ఈ సందర్భంగా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలి సింది. రాష్ట్రంలోని అన్నివర్గాలు సమిష్టిగా పొత్తుకు అంగీకారం తెలిపితే తప్ప పొత్తుల అంశం ముం దుకు సాగదన్న అర్థం వచ్చేలా చిరంజీవి కాంగ్రెస్‌ అధిష్టానానికిస్పష్టంచేసినట్లు తెలిసింది. మహా రాష్ట్రలో కాంగ్రెస్‌- ఎన్‌సిపి తరహా పొత్తులకు మాత్రమే సమ్మతమన్న సంకేతాలను ఆయన ఇచ్చారని, విలీనం సమస్యే లేదని తేల్చి చెప్పారని తెలిసింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని నేరుగా చర్చలు జరపాలని పిఆర్‌పి వర్గాలు భావిస్తు న్నాయి. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరిపే బాధ్యతను బూరగడ్డ వేదవ్యాస్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన రంగప్రవేశం చేసి పావులు కదుపుతున్నారు. పిసిసి చీఫ్‌ డి.శ్రీనివాస్‌ పొత్తులకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నందున అధిష్టానంతో సంప్రదించి సాను కూల ఫలితం వచ్చేలా చక్రం తిప్పుతారని పిఆర్‌పి వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాం గ్రెస్‌ పార్టీతో పొత్తుపై ప్రజారాజ్యంలో ఆశలు సజీ వంగానే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ముఖాముఖీ చర్చల కోసం ఏఐసిసి నుంచి పిలుపు వస్తుందన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఈ పొత్తులపై గత కొన్ని రోజులుగా జరుగు తున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌, పిఆర్‌ పిల మధ్య బంధం ధృడపడుతుందన్న ఆశావహ పరిస్థితులు కానవస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు సమస్యే లేదని, విలీనం ముచ్చటే లేదని, ఇక జనంలోకి వెళ్లి పోరాటాలు చేస్తామని ప్రజా రాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట ప్రకటించిన వెంటనే కాంగ్రెస్‌ అధిష్టానం చర్చలకు చొరవ చూపినట్లు తెలిసింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన ఎనిమిది నెలల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 70లక్షల ఓట్లు సాధించి 17శాతం ఓట్లతో చరిత్ర సృష్టించడం, గ్రేటర్‌ పరి ధిలో 11శాతం ఓట్లు ఉండటాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిగణలోకి తీసుకుంది. పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ఓటమికి పిఆర్‌పి దొహదపడటం, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడా నికి ఉపకరించిందన్న ప్రగాఢ విశ్వాసంతో పొత్తు లకు హస్తాన్ని అందించడానికి కారణంగా భావి స్తున్నారు.

పిఆర్‌పికి రాజీనామా
తూర్పుగోదావరి జిల్లా ఎల్లవరం మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు బుధవారం పిఆర్‌పికి రాజీనామా చేశారు. త్వరలోనే మాతృ సంస్థ అయిన టిడిపిలోకి చేరనున్నట్లు ఆయన తెలిపారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com