| బ్లాక్‌లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం |
| భుధ వారం, నవంబర్ 04, 2009 , 12:38 [IST] |
 |
|
పోలీసుల అదుపులో ఇ-సేవా సిబ్బంది.! ఉప్పల్, నవంబర్ 3 ప్రభాతవార్త: భారత్, ఆస్ట్రే లియా జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు మంగళవారం అదు పులోకి తీసుకున్నారు. వారిలో ఇ-సేవా ఉద్యోగు లు కూడా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్, కల్యాణపురిలోని హబ్సిగూడ ఇ-సేవా కేంద్రంలో బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తు న్నట్లు సమాచారం అందడంతో స్థానిక తహసీల్దా ర్ దేవదాస్ పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లారు. ఇ-సేవా కేంద్రంలోకి కొందరు వెళ్లి టిక్కెట్లు తీసుకుని బయటకు వస్తుండగా వారిని ఫ్రశ్నించారు.
ఇ-సేవా కేంద్రంలో పనిచేసే సె క్యూరిటీ సిబ్బంది డబ్బులు తీసుకుని అధిక రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఇ-సేవా కేంద్రం వద్దకు చేరుకుని సెక్యూరిటీ ఉద్యోగి అంజనేయులుతోపాటు, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇ-సేవా కేంద్రం మే నేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్ని స్తున్నారు. 1టిక్కెట్ రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు అధిక రేటుకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టిక్కెట్లతోపాటు, సుమారు 6వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కౌంటర్ ఫైల్ కూడా దొరికాయి. ఇందులో ఇ-సేవా ఉద్యోగుల పాత్ర ఎంత వరకు ఉందనే విషయంపై విచారణ చేస్తున్నామని మల్కాజిగిరి ఎసిపి పద్మజ తెలిపారు.
|
|
|
|
|
|
|