మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన జింబాబ్వే సిరీస్‌ బంగ్లా కైవసం
భుధ వారం, నవంబర్ 04, 2009 , 12:27 [IST]

banglaచిట్టాగ్యాంగ్‌, నవంబర్‌ 3 : బంగ్లాదేశ్‌, జింబాబ్వే జట్ల మధ్య కొనసాగుతున్న వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసి 5మ్యాచుల సిరీస్‌లో 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో అతి తక్కువ స్కోరు రికార్డుల్లో జింబాబ్వే చేరింది. కేవలం 24.5 ఒవర్లలో 44 పరుగులకే ఆలౌటై వన్డే రికార్డుల్లో ఐదవ అతి తక్కువ స్కోరుగా నమోదైంది. జోహుర్‌ అహ్మద్‌ చౌదరీ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో బంగ్లాదేశ్‌ బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటింగ్‌ లైనప్‌ పెవిలియన్‌కు క్యూకట్టింది. గతంలో విండీస్‌ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ సాధించి ఆదే ఊపును జింబాబ్వేపై స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శనిస్తోంది. చివరి వన్డే మ్యాచ్‌ నామమాత్రంగా జరగనుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే జట్టు కేవలం 44 పరుగులకే ఆలౌటైంది. ఐదో వికెట్‌కు వాల్లర్‌, మట్సీకెన్నెరీలు కలిసి 24 పరుగుల్ని జోడించారు. వాల్లెర్‌ 13 పరుగులు, కెన్నెరీ 11 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగిలిన వారెవ్వరూ రెండంకెల స్కోరు నమోదు చేయకపోవడం విశేషం. హుస్సేన్‌, అబ్దుర్‌ రజాక్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా, ఈమాన్యూల్‌, షాకిబ్‌ అల్‌ హసన్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును నజ్‌మల్‌ హుస్సేన్‌ అందుకున్నాడు.జవాబుగా బంగ్లాదేశ్‌ జట్టు 11.5 ఒవర్లలో 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ 22 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రైస్‌, క్రెమెర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

స్పిన్నర్ల హవా...
బంగ్లాదేశ్‌ సిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు టపటపా వికెట్లను నేలకూల్చారు. బంతిని ఎదుర్కొనేందుకు జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు.బంగ్లా స్పిన్నర్‌ షాకిబ్‌ అల్‌ హసన్‌, ఈమానుల్‌, అబ్దుర్‌ రజాక్‌లు బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించారు.

స్కోరుబోర్డు
జింబాబ్వే ఇన్నింగ్స్‌: మసకడ్జా సి అష్రఫుల్‌ బి హుస్సేన్‌ 2, వెర్మూలెన్‌ ఎల్బీ అబ్దుర్‌ రజాక్‌ 3, టేలర్‌ సి అండ్‌ బి రజాక్‌ 0, కొవెంట్రీ సి ముష్‌ఫికుర్‌ బి నజ్‌మల్‌ హుస్సేన్‌ 1, వాల్లెర్‌ సి నజ్‌మల్‌ హుస్సేన్‌ బి షాకిబ్‌ అల్‌ హసన్‌ 13, మెట్స్‌కెన్యేరీ సి మహ్మద్‌ అఫ్రఫుల్‌ 11, చిభాభా బి ఈమాన్యుల్‌ హక్‌ జూ. 0, చిగుంబరా సి అండ్‌ బి ఈమాన్యుల్‌ జూ. 4, క్రెమెర్‌ నాటౌట్‌ 7, ప్రైస్‌ ఎల్బీ బి షాకిబ్‌ అల్‌ హసన్‌ 0, జార్వీస్‌ సి అండ్‌ బి షాకిబ్‌ అల్‌ హసన్‌ 0, అదనం : 3, మొత్తం: 44 ఆలౌట్‌ (24.5 ఒవర్లు).
వికెట్ల పతనం: 1-2, 2-3, 3-4, 4-8, 5-32, 6-32, 7-36, 8-36, 9-39, 10-44.

బౌలింగ్‌: హుస్సేన్‌ 6-2-10-2, అబ్దుర్‌ రజాక్‌ 5-0-10-2, ఈమ్యానుల్‌ 7-2-16-3, షాకిబ్‌ అల్‌ హసన్‌ 6.5-1-8-3.
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ ఇక్బాల్‌ సి క్రెమర్‌ బి ప్రైస్‌ 22, జనైడ్‌ సిద్ధిఖీ సి వెర్మూలెన్‌ బి క్రెమర్‌ 8, మహ్మద్‌ అష్రఫుల్‌ ఎల్బీ బి ప్రైస్‌ 0, రకీబుల్‌ హసన్‌ నాటౌట్‌ 9, నయీమ్‌ ఇస్లామ్‌ సి చిభాభా బి క్రెమర్‌ 0, ముష్‌ఫికూర్‌ రహీమ్‌ నాటౌట్‌ 2, అదనం: 8, మొత్తం: 49/4 (11.5 ఒవర్లు).
వికెట్ల పతనం: 1-33, 2-33, 3-36, 4-38.
జార్వీస్‌ 2-0-21-0, చిగుంభరా 1-0-1-0, మట్సీకెన్యెరీ 2-0-9-0, ప్రైస్‌ 4-2-5-2, క్రెమెర్‌ 2.5-0-11-2.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు
 ఆటగాళ్ళ గదులనుంచి పెద్దఎత్తున..
 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
 క్వార్టర్స్‌లో సైనా
 ఫైనల్‌లో భారత్‌
 ప్రపంచ చాంపియన్‌షిప్‌..
 లంకపై ప్రతీకారానికి సిద్ధమైన..
 వీరూకు శ్రీలంక బోర్డు క్షమాపణ
 గెలుపు దక్కింది
 భారత్‌కు గెలుపు కావాలి
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com