| రాణించిన అఫ్రిది కివీస్ లక్ష్యం 288 |
| భుధ వారం, నవంబర్ 04, 2009 , 12:16 [IST] |
 |
|
అబుదాబీ, నవంబర్ 3: తటస్ట వేదికల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభమైన తొలి వన్డేలో పాకిస్థాన్ నిర్ణీత 50 ఒవర్లలో 287 పరుగులు చేసింది. శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం తొలిసారిగా కివీస్‌జట్టు పాక్ పర్యటనలో పాల్గొంటుంది. భద్రతా పరిణామాల దష్ట్యా తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని కివీస్ బోర్డు సూచించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.బాండ్ బౌలింగ్‌లో ఒపెనర్ సల్మాన్‌భట్ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ యూనిస్‌ఖాన్ కూడా బాండ్ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్‌కు ఖాలీద్ లతీఫ్, మహ్మద్ యూసుఫ్‌లు కలిసి 57 పరుగులు జోడించారు. లతీఫ్ 2 ఫోర్లతో 64 పరుగులు చేసి వెటోరీ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
మహ్మద్ యూసుఫ్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదష్ట వశాత్తు రనౌట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. ఉమర్ అక్మల్ 9 పరుగులకే వెటోరీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకొచ్చిన షాహిద్ ఆఫ్రిదీ, కీపర్ కమ్‌రాన్ అక్మల్‌లు కలిసి 171 పరగుల భాగస్వామ్యాన్నందించారు. ఆఫ్రిదీ 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో 70 పరుగులు, అక్మల్ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అబ్దుల్ రజాక్ 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. ఉమర్‌గుల్, మహ్మద్ ఆమేర్‌లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. దాంతో పాక్ 9 వికెట్ల నష్టానికి 287 పరుగుల్ని సాధించింది. బాండ్, వెటోరీ రెండేసి వికెట్లు పడగొట్టగా సౌథీ, బట్లర్, ఒరమ్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలందే సరికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఉమర్ గుల్ 2 వికెట్లు, మహ్మద్ ఆమేర్ ఒక వికెట్ పడగొట్టారు.
స్కోరుబోర్డు పాకిస్థాన్ ఇన్నింగ్స్: సల్మాన్‌భట్ సి మెక్‌కల్లమ్ బి బాండ్ 0, ఖాలీద్ లతీఫ్ బి వెటోరీ 64, యూనిస్‌ఖాన్ సి మెక్‌కల్లమ్ బి బాండ్ 0, మహ్మద్ యూసుఫ్ రనౌట్ 30, ఉమర్ అక్మల్ బి వెటోరీ 9, షాహిద్ అఫ్రిదీ సి బట్లర్ బి ఒరమ్ 70, కమ్‌రాన్ అక్మల్ నాటౌట్ 67, అబ్దుర్ రజాక్ సి స్టైరిస్ బి బట్లర్ 26, ఉమర్‌గుల్ 0, మహ్మద్ ఆమేర్ 0, సయీద్ అజ్మల్ నాటౌట్, అదనం: 21, మొత్తం: 287/9 (50 ఒవర్లు). వికెట్ల పతనం: 1-0, 2-0, 3-57, 4-75, 5-176, 6-184, 7-270, 8-271, 9-277. బౌలింగ్: బాండ్ 10-2-61-2, సౌథీ 10-2-54-1, బట్లర్ 7-0-54-1, ఒరమ్ 10-0-47-1, వెటోరీ 10-1-34-2, మెక్‌కల్లమ్ 3-0-29-0.
|
|
|
|
|
|
|