భారీ బందోబస్తు మధ్య శిబిరానికి హైదరాబాద్, నవంబర్ 3 : ప్రతిష్టాత్మక 7 వన్డేల సిరీస్‌లో కీలకమైన మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు మ్యాచుల్లో 2-2తో సిరీస్ సమం చేసుకున్న భారత్ కీలకమైన మూడో వన్డే కోసం హైదరాబాద్‌లో పోటీకి సిద్ధమైంది. మొహాలీలో వరుసగా మూడో సారి పరాజయం పాలైన భారత్ ఉప్పల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ కొట్టి సిరీస్‌లో పటిష్ట స్థితికి చేరాలనుకున్న భారత్‌కు మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో ఎదురు దెబ్బ తగిలింది.
మొహాలీలో భారత్ ఆడిన చివరి రెండు మ్యాచుల్లో పరాజయం పాలై ఇప్పుడు హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇంతకు ముందు ఇదే వేదికపై ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచుల్లో భారత్ ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో భారత్ దూకుడుకు ఆసీస్ నాలుగో వన్డేలో గండి కొట్టింది. గత రెండు మ్యాచుల్లో టాస్ గెలిచి మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు నాలుగో వన్డేలో టాస్ ఓడటం కలిసివచ్చింది. దీంతో నాగ్‌పూర్, ఢిల్లీ వన్డేల్లో చెలరేగిన భారత్‌కు మొహాలీలో చుక్కెదురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ అర్దశతకం సాధించలేని దశలో భారత్ మొహాలీలో ఆసీస్‌కు 24 పరుగుల తేడాతో తలొగ్గి సిరీస్‌లో 2-2తో వారికి సమతూకంగా నిలిచింది.
బౌలింగ్, ఫీల్డింగ్‌లో తాము సమతూకంగా ఉన్నా బ్యాటింగ్ వైఫల్యం వల్లే మ్యాచ్‌ను చేజార్చుకున్నామని భారత్ కెప్టెన్ ధోని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా హైదరాబాద్‌లో జరగనున్న అయిదో వన్డే ఈ సిరీస్‌లో కీలకంగా మారడంతో టికెట్ల కోసం అభిమానులు తొక్కిసలాడుకునే పరిస్థితి నెలకొంది.