|
మూంగ్‌దాల్ స్టఫ్డ్ పరాఠా కావలసిన పదార్థాలు మైదా లేదా గోధుమ పిండి- కప్పుడు వంట నూనె-రెండు టేబుల్ స్పూన్లు(పిండిని కలపడానికి) కాల్చడానికి నూనె-ఎనిమిది టేబుల్ స్పూన్లు పెసరపప్పు-అరకప్పు పచ్చికారం-ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్-ఒక టేబుల్ స్పూన్ ఇంగువ-చిటికెడు అల్లం, పచ్చిమిరపకాయల ముద్ద-ఒక టేబుల్ స్పూన్ ఉప్పు- తగినంత
తయారుచేయు విధానం: పెసరపప్పును ముందుగా ఉడికించుకోవాలి. అది చల్లారాక కవ్వంతో బాగా కలిపితే పల్చటి ముద్దలాగా తయారవుతోంది. ఈ మిశ్రమానికి పచ్చిమిరప కాయలు, అల్లం ముద్ద, పచ్చికారం, ధనియాల పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల వంటనూనెను వేడిచేసి ఆ మిశ్రమంలో వేయాలి. ఇలా వేడి నూనెవేయడం వల్ల పరోఠాలు మెత్తగా వస్తాయి. ఈ పప్పు ముద్దలో ఇంగువ కూడా వేసి బాగా కలపాలి.
పరాఠా తయారీ: గోధుమపిండి లేదా మైదాలో కొద్దిగా ఉప్పు, కొంచెం నీరు పోసి పిండి మెత్తగా కలుపుకోవాలి. దీనిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనెను కూడా పోయాలి. ఈ పిండి ముద్దను నిమ్మకాయంత సైజులో చేసుకొని మధ్యలో పెసరపప్పు మిశ్రమాన్ని కూరాలి. దీనిని చపాతీల్లాగా తయారుచేసి తక్కువ మంటమీద కాల్చుకోవాలి. వేడివేడి మూంగ్‌దాల్ స్టఫ్డ్ పరాఠా రెడీ అవు తుంది. దీనితో పాటు ఉల్లిపాయ ముక్కలు తింటే ఆరోగ్యానికి మంచిది కూడా.
కేరళ పరాఠా కావలసిన పదార్థాలు గోధుమపిండి-ఒక కప్పు నూనెలేదా నెయ్యి-ముప్పావు కప్పు బియ్యపు పిండి -రెండు టేబుల్‌స్పూన్లు వేయించడానికి నూనె లేదా నెయ్యి- 8టేబుల్ స్పూన్లు కోడిగుడ్డు-ఒకటి ఉప్పు-తగినంత
తయారుచేయు విధానం: గోధుమపిండిలో నీరు, ఉప్పు, నెయ్యి, కోడిగుడ్డు పగలగొట్టి అందులో వేసి బాగా కలపాలి. ఈ కలిపిన ముద్దను కాసేపు మూతపెట్టి పక్కన పెట్టాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లాగా చేసుకోవాలి. దీనిని రౌండ్‌గా మళ్లీ చుట్టి, దానిని తిరిగి చపాతీలాగా చేసుకోవాలి. ఈవిధంగా రౌండ్స్ చేయడం వల్ల చపాతీలో పొరలు ఎక్కువగా వస్తాయి. తినడానికి మెత్తగా, రుచిగా ఉంటుంది. సన్నటి మంట మీద కాల్చుకుంటే తినడానికి బాగుంటుంది. ఇలాంటి పరోఠాలు తింటే ఆరోగ్యానికీ కూడా ఎంతో మంచిది.
తందూరి రోటీ కావలసిన పదార్థాలు గోధుమపిండి లేదా ఆటా పిండి నూనె- ఒక టేబుల్ స్పూన్ నీరు-తగినంత ఉప్పు-తగినంత
తయారుచేయు విధానం: గోధుమపిండిలో ఉప్పు, సరిపడినంత నీరు పోసి మెత్తగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దానిని ఎనిమిది అంగుళాలు ఉండేటట్టుగా రోటీలను చేసుకోవాలి. చేసిన రోటీమీద కొద్దిగా నీటితో తడిచేసి మడిచి మళ్లీ చేసుకోవాలి. దానిని తవాలో సన్నని మంట మీద కాల్చుకోవాలి.
5నిమిషాల తరువాత దానిని అట్లపుల్లతో పట్టుకుని మంట డైరెక్ట్‌గా తగిలేటట్టు స్టవ్ మీద 5నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత తిరిగి తవా మీద 5నిమిషాలు ఉంచాలి. ఈవిధంగా చేయడం వల్ల రోటీని అటుఇటు తిప్పనవసరం లేకుండా కాలిపోతుంది. వేడివేడి తందూరి రోటీ తయారవుతుంది. ఇటువంటి రోటీలు తినడం ఆరోగ్యానికి ఎంతో క్షేమకరం.
|