మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
చైతన్యంతో వికసిస్తున్న నైపుణ్యం
భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:46 [IST]
పి.సూర్యకుమారి

cheliమహిళా లోకం తమ నైపుణ్యంతో ఎన్నో విజయాలను సాధిస్తోంది. పురుషులకు తాము తీసిపోమని నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఈ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఆర్థిక ప్రయోజనం కలిగించే అంశాలే కాకుండా సామాజిక అభివృద్ధిని ఆశించే ప్రతి కార్యక్రమంలోనూ మహిళలు కీలకపాత్ర వహిస్తున్నారు.

ఎవరిమీద ఆధారపడకుండా తమకు తాము సంపాదించుకొంటూ పదిమందికీ ఆదర్శంగా నిలవాలన్న తపన ప్రతి మహిళలో కన్పిస్తోంది. మహిళల స్వయం సహాయక సంఘాలు విస్తరణ మహిళల స్వయం ప్రతిపత్తికి, మనోనిబ్బరానికి ప్రబల సాక్ష్యంగా పేర్కొనవచ్చు. మనదేశంలో మహిళల స్వయం సామర్థ్యాన్ని పెంపొందించే ప్రణాళికలు ఎన్నో రూపొందుతున్నాయి.

మహిళల స్వయం సామర్థ్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించడానికి, ఆర్థిక పటిష్టతను మరింత పెంచడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కావలసిన ప్రత్యేకనిధిని మొదట 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగస్వాములయ్యే మహిళల నుంచి, ఆర్థిక, ధాతృత్వ సంస్థల నుంచి, నాబార్డు నుంచి ఈక్విటీఫండ్‌ను వసూలు చేస్తారు. మహిళ స్వయంశక్తి సామర్థ్యాలు సన్నగిల్లిపోకుండా నిరా ఘాటంగా కొనసాగేలా సహకరించడానికి స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ అకాడవిూ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ ఈ కార్యక్రమానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ప్రపంచంలో ఆర్థిక పురోభివృద్ధికోసం ఎన్నో ప్రణాళికలు రూపొందుతున్నాయి. అధ్యయ నాలు, పరిశీలనలు కొనసాగుతున్నాయి. ఇవి ఎంతవరకు నేరుగా ప్రజలకూ ప్రయోజనం కలిగిస్తున్నాయో స్పష్టం కాకపోయినా డ్వాక్రా (డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌) ఇతర స్వయం సహాయక గ్రూపులు మాత్రం సత్ఫలితాలను సాధిస్తు న్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, సమాజంలో తమ హోదాను పెంచుకోవడానికి ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. స్వయం సామర్థ్యంతో మహిళలు దేనినైనా సాధించ గలరని నిరూపిస్తున్నాయి.

ప్రపంచంలోని అగ్రనాయకులు ఈ స్వయం సహాయక గ్రూపుల నైపుణ్యాన్ని పరిశీలించి విస్మయం చెందుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇలాంటి గ్రూపులు విస్తరిస్తే మహిళలు పేదరికం నుంచి బయటపడి తమ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడమే కాక సమాజానికి ప్రయోజనం కలిగించే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారని వాషింగ్టన్‌లో ఇటీవల జరిగిన వరల్డ్‌ మైక్రో క్రెడిట్‌ సదస్సు అభిప్రాయపడింది.

ప్రపంచం మొత్తం మీద త్రిఫ్టు సొసైటీ రుణాలపై ఆధారపడి ఎదుగుతున్న 10మిలియన్ల మహిళల్లో 2మిలియన్ల మహిళలు మన రాష్ట్రంలోనే ఉన్నారన్నది ఒక అంచనా. వాస్త వానికి దేశం మొత్తం మీద 2.10 లక్షల స్వయం సహాయక గ్రూపులుండగా, 79వేల గ్రూపులు మనరాష్ట్రంలోనే ఉన్నాయి.

ఈ స్వయం సహాయక గ్రూపులతో పాటు మహిళా శిశు సంక్షేమ విభాగం కూడా దాదాపు 4వేల గ్రూపు లకు ఆర్థికప్రయోజనాన్ని అందిస్తోంది. సుమారు 60వేల మంది మహిళలకు ఆర్థిక సహాయాన్ని కల్పించడానికి 15కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ సొసైటీల్లోని మహిళలు మొదట తమ కుటుంబాలకు ఆసరాగా నిలబడగలుగు తున్నారు. తరువాత సామాజిక పురోభివృద్ధిలో కీలక పాత్ర వహించగలుగుతున్నారు.

ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, పౌష్టికాహార పంపిణీ, విద్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాల్లో వీర కార్యాచరణ బాగా కన్పిస్తోంది. గ్రామాల అభివృద్ధికి చేపట్టిన జన్మభూమి వంటి కార్యక్రమాల్లోనూ వీరు ముందడుగు వేస్తున్నారు.
హస్తకళా నైపుణ్యంతో వీరు రూపొందించిన కళాఖండాలు.

నిత్యావసర సామగ్రి, గృహా లంకరణలు, తినుబండారాలు, మార్కెట్‌లో తమకు తామే అమ్ముకునేలా ప్రభుత్వం ప్రోత్స హిస్తోంది. ఇందులో దళారీల ప్రమేయం లేదు. గత మూడు నెలల్లో రాష్ట్రంలో డ్వాక్రా మేళాలు జరిగాయి. సుమారు 1.50 కోట్ల రూపాయలు విలువైన డ్వాక్రా ఉత్పత్తులు అమ్ముడయ్యాయి.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు తమ నైపుణ్యాన్ని నగరవాసుల ఎదుట ప్రదర్శించ డానికి డ్వాక్రా మేళాలు వేదికలవుతున్నాయి. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, పోటీకి తట్టుకుని వినియోగదారుల ఆకాంక్షలను తగ్గట్టు ఎలాంటివి రూపొందించాలో వీరికి అవగాహన కలుగుతోంది. అందుకనే మహిళల స్వయం సామర్థ్యాన్ని మరింత రాణింపచేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com