|
శ్రీకాంత్ హీరోగా, మీరాజాస్మిన్, సదా హీరోయిన్లుగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో కల్పనా ఆర్ట్స్ పతాకంపై బొద్దం అశోక్ యాదవ్ నిర్మిస్తున్న సంపూర్ణ హాస్యభరిత చిత్రం 'అఆ ఇఈ.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసుకుని 6న విడుదలకు సిద్దమైంది ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 'నా గత చిత్రాల్లాగే ఈ చిత్రంలో చక్కటి వినోదంతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. భార్యా భర్తల అనుబంధం, అప్యాయతలు, గిల్లికజ్జాలను ఈ చిత్రంలో ఆవిష్కరి ంచడం జరిగింది.కార్తీకమాస కానుకగా ప్రేక్షకులకు అందిస్తున్నాం నా అన్ని చిత్రాల కంటే హాస్యం పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఆడియోకు మంచి స్పందన వస్త్తోంది. పాటలన్నీ మెలోడీ ప్రధానంగా శ్రోతల్ని ఆకట్టుకుం టున్నాయి. ఈ చిత్రం అందరినీ సంతృప్తి పరుస్తుందనే విశ్వాసం ఉంది అని ఆన్నారు.
|