|
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో త్రి భాషా చిత్రంగా రూపొందుతున్న 'రక్తచరిత్ర.లో ఎన్టీఆర్ పాత్రకు సీనియర్ బాలీవ్ఞడ్ నటుడు శత్రుఘ్నసిన్హ ఎంపికయ్యారు.
సినర్జీ పతాకంపై మధుమంతెన, శీతల వినోద్ తల్వార్‌లు పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య మద్దెల చెరువ్ఞ సూరి పాత్రలో సూర్య, వివేక్ ఒబరా§్‌ు పరిటాల రవి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలోని హీరోయిన్ ఫోటోలను రాంగోపాల్ వర్మ మీడియాకు ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతుంది. ఈ చిత్రంలో ఎవరినీ నాయక, ప్రతినాయక పాత్రలో కాకుండా రాజకీయ కోణంలో కాకుండా పాత్రల యొక్క భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ వాస్తవ కోణంలో తెరకెక్కించనున్నట్లు రాంగోపాల్ వర్మ తెలిపారు.
|