| అరుణాచల్ మాదే! |
| భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:08 [IST] |
 |
|
న్యూఢిల్లీ, నవంబర్3: అరుణాచల్ ప్రదేశ్ తమ దంటూ చైనా చేస్తున్న వాదనను ఆ రాష్ట్ర విద్యా ర్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అరుణాచల్ ముమ్మాటికి తమదే అని, భారతదేశంలోనే ఉందని, వారు స్పష్టం చేసారు. చైనా వైఖరికి నిర సనగా మంగళవారం రాజధాని లో ప్రదర్శన నిర్వహించారు.
అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగిం ది. చైనా దురాక్రమణ దారులా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలకు మనో వేదన కలిగిస్తున్నదని, ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, వారు విమర్షించారు.
సామ్రాజ్యవాదంతో చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ కొంత భాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నదని, అదే జరిగితే రాష్ట్ర ప్రజలు ఊరు కోరని, వారికి తగిన సమాధానం చెబుతారని వారు హెచ్చరించారు. భారత పాకిస్థాన్, సరిహద్దుల్లో భౌగోళికంగా చైనా కీలక స్థానంలో ఉంది, ఈ స్థితిని ఆసరాగా చేసుకుని అక్కడున్న మైదానాలను, జల వనరులను కాజేయాలని చైనా ప్రయత్నిస్తున్నట్టు వారు ఆరోపించారు.
|
|
|
|
|
|
|