మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
రాజకీయ పక్షాల అగ్నిపరీక్షగా నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
మంగళ వారం, అక్టోబర్ 13, 2009 , 4:18 [IST]

electionsన్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 : మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రధాన రాజకీయ పక్షాలకు జరిగే తొలి అగ్నిపరీక్షగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. హర్యానా,అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో ఎన్‌సిపితో కలిసి అధికారాన్ని పంచుకొంటున్నది.ఆ రాష్ట్రంలో శివసేన- బిజెపి కూటమి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నది.ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం ఏడుగంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది. శాంతియుతంగా పోలింగ్‌ జరిగేం దుకు ఎన్నికలసంఘం (ఇసి) మహారాష్ట్రలో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసింది.

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతా లపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్‌, బిజెపిలతో పాటు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు చెందిన అగ్రనాయకులు నాలుగువారాల పాటు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ప్రశాం తంగా జరిగింది.గతవారం మహారాష్ట్రలోని గడ్ఛిరోలిలో నక్సలైట్లు జరిపిన దాడిలో 17 మంది పోలీసులు మరణించడంతో ఎన్నికల అధికారులు ఆందోళన చెందారు.శాంతియుతంగా పోలింగ్‌ నిర్వహ ణకు ఒక్క మహారాష్ట్రలోనే 18,000 కేంద్ర పోలీస్‌ దళాలను ఇసి మోహరించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ,ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సుడిగాలి పర్యటన జరిపారు.

ఈ మూడు రాష్ట్రాల్లో బిజెపి సీనియర్‌ నాయకులు ఎల్‌.కె. అద్వానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, ఎం.వెంక య్య నాయుడు ముమ్మరంగా ప్రచారం చేశారు. వరుసగా మూడో సారి ఎన్‌సిపితో కలిసి మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. పదేళ్ల క్రింత అధికారాన్ని కోల్పోయిన శివసేన-బిజెపి కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కుమారుడు రాజేంద్ర అలియాస్‌ రావుసాహిబ్‌ షెకావత్‌ పోటీచేస్తున్న అమరావతి నియోజవర్గంపైనే అందరి దృష్టిఉంది. హర్యానాలో రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. ఐఎన్‌ఎల్‌డి,బిఎస్పీలతో బిజెపి సంబంధాలు తెంచుకొని హర్యానా జనహిత్‌ కాంగ్రెస్‌తో పొత్తుకుదుర్చుకోవడంతో ఆ రాష్ట్రంలో ప్రతి పక్ష కూటమిలో చీలిక ఏర్పడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకగీవ్రంగా ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి ఖండూ డోర్జీ కూడా ఉండడంతో ఆ రాష్ట్రం లో కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తున్నది.మహారాష్ట్రలో 7 కోట్ల 58 లక్షలు,హర్యానాలో కోటి 31 లక్షలు,అరుణాచల్‌ ప్రదేశ్‌లో 7 లక్షల 50 వేల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే 22 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో హింస
నెలరోజుల పాటు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకొన్నాయి. వేరువేరుగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒక బిజెపి కార్యకర్త మరణించగా ఎంతో మంది గాయపడ్డారు. సెప్టెంబర్‌ 28 వ తేదీన షోలా పూర్‌ జిల్లాలోని అక్కల్‌కోట్‌ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక బిజెపి కార్యకర్త మరణించాడు. అక్కల్‌కోట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సిద్ధారం మహెత్రా తరపున కాల్పు లు జరిగాయని, ఆయనను అరెస్ట్‌చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. హన్మంత్‌ బగల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో అక్టోబర్‌ 10 వ తేదీన జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎన్‌సిపి అభ్యర్థి శ్యామల్‌తా§్‌ు బగల్‌పై గుర్తుతెలియని వ్యక్తులుకాల్పులజరిపారు.ఆదివారం పూణే లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల నుంచి శివ సేన అభ్యర్థి సురక్షితంగాతప్పించుకొన్నారు.

సంగోల- హతోడ్‌ రోడ్డులో ఆదివారం రాత్రి సంగోల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచే స్తున్న శ్రీకాంత్‌దేశ్‌ముఖ్‌పై కాల్పులు జరిగాయి. తుపాకీ గుండు ఆయన చెవిని రాసుకుంటూ పోయినట్లు పోలీ సులు చెప్పారు.50 మందిపై ఆదివారం రాత్రి పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆదివారం తమ అభ్యర్థి వెళుతున్న కారుపై కాల్పులు జరిగిన కారణంగా వడ్గాం- షేరి అసెంబ్లీ నియోజక వర్గాన్ని సున్నితమైన నియోజక వర్గంగా ప్రకటించాలని శివసేన డిమాండ్‌ చేసింది.

మహారాష్ట్రలో పోలింగ్‌కు ఏర్పాట్లు

మహారాష్ట్రలో 84,136 పోలింగ్‌ స్టేషన్లు నెలకొల్పి నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి దేబాశిష్‌ చక్రవర్తి తెలి పారు. పోలింగ్‌ స్వేచ్ఛగా,ప్రశాంతంగా జరగడానికి తాము అన్ని చర్యలు తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లన్నీ చేసినట్లు ఆయన తెలిపారు.పోలింగ్‌ విధుల నిర్వహణకు 4,78,115 మందిని నియమించినట్లు ఆయన అన్నారు. మహా రాష్ట్రలో 7,56,34,525 మంది ఓటుర్లున్నారు. మొత్తం 3,558 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 1820 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 211 మంది మహిళా అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

అరుణాచల్‌ ఎన్నికలబరిలో 60 మందికి పైగా కోటీశ్వరులు
అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 151 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వారిలో 60 మందికి పైగా కోటీశ్వరులే.పాలిన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీపుల్స్‌పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పిపిఎ) అభ్యర్థిగా పోటీచే స్తున్న టకం టాగర్‌ అత్యంత ధనవంతుడు. ఆయనకు 229 కోట్లు రూపాయల మేరకు ఆస్తి ఉంది. డో§్‌ుముఖ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న నబం రెబియా తనకు 24 కోట్లరూపాయల మేరకు ఆస్తులున్నట్లు ప్రకటించగా ముక్తా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి డోర్జూ ఖండూ 22 కోట్ల రూపాయల మేరకు ఆస్తులున్నట్లు ప్రకటించారు.

ఇటానగర్‌నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న లిచీ లెగి తనకు 22 కోట్ల రూపాయల మేరకు ఆస్తులున్నట్లు తెలి పారు. ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న 1200 స్వచ్ఛంద సంస్థలతో కూడిన జాతీయ ఎన్నికల పరిశీలనా వేదిక తన నివేదికలో ఈ అంశాల్ని వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన 37 మంది కోటీశ్వరులు పోటీచే స్తున్నారు.నేషనల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ తరపున ఎనిమిది, బిజెపి తరపున ఆరు,అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఏడుమంది,పిపిఎ తరపుననలుగురు కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరంతా తమ ఆస్తులను ప్రక టించారు. కానీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 49మంది కోటీశ్వరులతో పాటు 130 మంది అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించలేదు.

 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 తారలు దిగివచ్చిన వేళ...
 కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
 పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి:..
 జగన్‌ ఓదార్పుపై ప్రధాని పిలుపుతో..
 కాశ్మీర్‌లో అన్నివర్గాలతో..
 ఇసి కొత్త కమిషనర్‌గా ఎపి కేడర్‌..
 చట్టసభల్లో రిజర్వేషన్లకోసం..
 అక్రమమైనింగ్‌పై లోక్‌సభలో టిడిపి..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com