| కాకినాడలో భారీ పేలుడు నలుగురి దుర్మరణం |
| సొమ వారం, సెప్టెంబర్ 28, 2009 , 2:53 [IST] |
 |
|
కాకినాడ క్రైమ్, సెప్టెంబర్ 27, ప్రభాతవార్త: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర నడిబొడ్డులో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకనిపరిస్థితి విష మంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ అతడు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు.
కాకినాడ పెద్దమార్కెట్ మధ్యలో ఆకస్మా త్తుగా పేలుడు సంభవించడంతో గండిమేను విజయ(22), వెళ్లంకి శ్రావణి(18), గండిమేను పెదబాబు(20)తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఘటనలో గాయపడ్డ గండిమేను బాబిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రి లోని అత్యవసర విభాగానికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.
అయితే ప్రమాదా నికి గల కారణాలపై అటు పోలీసులు, ఇటు అగ్నిమాపక అధికారులు కూపీ లాగు తున్నారు. తొలుత గ్యాస్ సిలెండర్ కారణంగా ప్రమాదం సంభవించినట్టుగా భావించారు. అయితే ఈ ప్రమాదం వెనుక మందుగుండు సామగ్రి పేలుడు జరిగి ఉండవచ్చని అంచనాకు వచ్చారు. జిల్లా ఎస్పీ వై నాగిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాద వివరాలపై ఆరా తీశారు.
|
|
|
|
|
|
|