మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం పిబ్రవరి   09th 2010 - 12:45 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
అగ్రగామిగా రాష్ట్రం
సొమ వారం, సెప్టెంబర్ 28, 2009 , 3:24 [IST]

rosaiahహైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27, ప్రభాతవార్త: ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లోఅగ్రగామిగా తీర్చి దిద్దేందుకు శాయశక్తులాకృష ిచేస్తానని రాష్ట్ర ముఖ్య మంత్రి కె రోశయ్య వ్యాఖ్యానించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశలను, ఆశయాలను స్వప్నాలకు కార్యరూపం ఇచ్చేందుకు తన వంతు కర్తవ్యం నిర్వహిస్తానని రోశయ్య హామీ ఇచ్చారు. ఈ హామీని విజయదశమి కానుకగా స్వీకరించా లని ఆయన రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ తలపెట్టినఅన్నిప్రాజెక్టులు,కార్యక్రమాలు మరింత పక్కాగా అమలు చేస్తామని రోశయ్య తెలిపారు. ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ ప్రారంభించిన, తలపెట్టిన కార్యక్ర మాలు మరింత పట్టుదలగా అంకిత భావంతో అమలు చేస్తామని ఈ విషయలో

ఎటువంటి సందేహాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. విజయ దశమి సందర్భంగా ప్రజలు అంతా వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు నెరవేర్చటానికి పునరం కితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలో అన్ని విభాగాల్లోనూ నెంబర్‌ వన్‌గా అభివృద్ధి చేయాలని వైఎస్‌ తలపోశారన్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ ప్రవేశ పెట్టిన విస్తృతమైన అన్ని రకాలు కార్యక్రమాలు నిరంత రంగా కొనసాగుతాయని ఈ పండగ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పథకాలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లని ఆయన అభివర్ణించారు. తలపెట్టిన కార్యక్రమాల ఫలితాలు రాబట్టటానికి నిరంతర ప్రయత్నం సాగిస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో భారీ, మరియు మధ్యతరగతి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కలిపి 81 వరకు నిర్మాణం చేపట్టామన్నారు. గత ఐదు సంవత్సరాలో ఇప్పటి వరకు 12 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఇంకా అనేక ప్రాజెక్టులు నిర్మాణం వేగవంతంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఇందిరాసాగర్‌తో పాటు మరోఐదు ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పోలవరం జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చిందన్నారు. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. వీటితో పాటు అనేక చిన్న తరహా ప్రాజెక్టులు తలపెట్టామని 5,40,800 ఎకరాలకు ఈ ప్రాజెక్టులు ద్వారా నీరు అందిస్తామన్నారు. జపాన్‌ ఇంటర్‌ నేషనల్‌ కార్పొరేషన్‌ నుంచి 8,547 కోట్ల రూపాయలు ఆప్పును ఆశిస్తున్నామని ఈ డబ్బును చిన్న తరహా ప్రాజెక్టులకు వాడుతామన్నారు. అన్ని రకాల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఈ విషయంలో కూడా ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదన్నారు.

వైఎస్‌ ప్రారంభించిన కిలో రూII 2 బియ్యం పథకం, రైతులకు 9గంIIలు ఉచిత విద్యుత్‌, పేదవిద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సామాజిక భద్రత పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అభయహస్తం తదితర పథకాల్ని ఇటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి మండలాల్లో కరువు తాండవిస్తుందని అయితే దీన్ని అధిగమించటానికి రాష్ట్ర ఫ్రభుత్వ తగిన నివారణ చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలకు తగిన ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ, మరియు పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు జరిగాయన్నారు. పశుగ్రాసంకు ఏర్పాట్లు జరిగాయన్నారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలనే ప్రయత్నంచేస్తున్నామన్నారు. స్వైన్‌ ఫ్లూకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వైన్‌ ఫ్లూ వ్యాధి శోకిన వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ఏప్రిల్‌ 1న జూ.ఎన్టీఆర్‌..
 మెరుగుపర్చకుంటే మెతుకుండదు:..
 తాలిబన్లను తలపిస్తున్నారు
 'అదుర్స్‌ను బహిష్కరిస్తున్నాం
 గాడి తప్పిన రోశయ్య పరిపాలన: తలసాని
 వర్సిటీలపై మూడు కమిటీల ఏర్పాటు
 రాజ్యాంగ విరుద్ధం
 
 
ముఖ్య వార్తలు
  కత్రినా ఐటమ్‌సాంగ్‌
  ఫిలిప్పీన్స్‌ పోలీసుల కాల్పుల్లో..
  భారత పర్యటనకు 5 ఇంగ్లండ్‌ మహిళా..
  కోల్‌కతా టెస్టుకు శ్రీశాంత్‌
  ఎటిపి ర్యాంకింగ్‌లో మెరుగుపడ్డ..
  పేదల పక్షపాతిగా మోడీ
  స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం!
  త్వరలో అదుపులోకి ధరలు : ప్రణబ్‌
ముస్లిం రిజర్వేషన్స్ పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు సమంజసమేనా?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com