కోల్‌కతా: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఎస్‌ఐకి చెందిన ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ మహిళను ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయవిమానాశ్రయంలో అరెస్ట్‌చేశారు. శనివారం సాయం త్రం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బ్యాంకాక్ నుంచి ఇక్కడకు చేరుకున్న ఆమెను అరెస్ట్ చేసినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
పాస్‌పోర్టుల ఫోర్జరీ, మనుషుల అక్రమ రవాణా ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు జారీ చేసిన అన్వేషణ నోటీసు ఆధారంగా 37ఏళ్ల మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఢిల్లీ నివాసి అయిన ఆమె తరచూ మలేసియా వెళ్లివస్తున్నదని,నెలలోనేరెండుసార్లువెళ్లివచ్చిందనినిఘాఅధికారులు చెప్పారు.