మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
వీపు నొప్పిని తగ్గించే భూదేవి నమస్కారం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:12 [IST]

cheliవయస్సు 60 సంవత్సరాలు. నాకు అప్పుడప్పుడు వీపునొప్పి ఎక్కువగా వస్తుంటుంది. బాధను భరించలేకపోతున్నాను. ఈ నొప్పిని తగ్గించే సులువైన ఆసనం యోగలో ఏమన్నా ఉంటే తెలుపగలరు?
శ్యామల, గుంటూరు

రెండు కాళ్లను చక్కగా చాచి పాదాలను చక్కగా ఉంచాలి. రెండు అరచేతులను ఎడమవైపుకు ఆనించి శ్వాసను వదిలేస్తూ తలను, నుదురు, ముక్కును నెమ్మదిగా నేలను తాకే ప్రయత్నం చేయండి. ఎంత వరకు వంగడానికి వస్తే అంత మీ శక్తి అనుసారం వంచండి. శ్వాసను పీలుస్తూ తిరిగి యధాస్థానం రావాలి. అదేవిధంగా అభిముఖంగా చేయండి. ఈవిధంగా 10 నుండి 20 సార్లు ప్రయత్నం చేయండి.
ప్రాణాయామం
రెండు చేతులు, చూపుడు వ్రేళ్లను మడిచి వాయుముద్ర వేసి చేయాలి.
కపాలబాతి
శ్వాసను బయటకు పొట్టలోనికి సెకనుకి ఒకసారి (జట్క) నిమిషానికి 60 సార్లు మొదటిరోజు 5నిమి షాలు చేసి నెల వచ్చేనాటికి 15నిమిషాలు చేయండి. మీ సమస్య నెమ్మది నెమ్మదిగా తొలగి పోతుంది.
నా వయస్సు 26సంవత్సరాలు. నాతొడలు చాలా లావుగా ఉండి అందవికారముగా తయారైనవి. అప్పుడప్పుడు కాళ్లు లాగుతూ పట్టేస్తాయి. యోగలో వీటిని తగ్గించుకునే ఆసనం ఏదయినా ఉంటే తెలియజేయగలరు. మీ సలహా కొరకు ఎదురుచూస్తున్నాను?
శారద, విజయవాడ

రామదండాసనం
పటంలో చూపించిన విధంగా రెండు కాళ్లను దూరంగా చాచి చేతులు ముందుకు ఉంచి, శ్వాసను పీలుస్తూ మోకాళ్లను వంచుతూ పూర్తిగా కుడికాళ్లు మీద భారం వేసి కూర్చొనే ప్రయత్నం చేయండి. ఎడమ కాళ్లు చక్కగా చాచాలి. ఈ స్థితి నుండి శ్వాసను వదిలేస్తూ యధాస్థానం రావాలి. అదేవిధంగా అపోజిట్‌ చేయండి. ఒకేరోజు పరిపూర్ణంగా చెయ్యాలని బలవంతంగా చేయరాదు. మీ శరీర శక్తి మేరకు ఎంత చేయగలిగితే అంతే చేయండి.
10సార్ల చొప్పున మొదటిరోజు చేసి ఒక నెల వచ్చే నాటికి 20 సార్లు ప్రాక్టీస్‌ చేయండి. సరైన ఆహారం హితమైన ఆహారం మితంగా తీసుకుంటూ సరైన సాధన చేస్తే తప్పక ఫలితాలు వస్తాయి.
అనులోమ,విలోమ
కుడి చెయ్యి బొటన వ్రేలుతో కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలిపీల్చి కుడితో వదలాలి. కుడితోనే మళ్లీ తీసుకొని ఎడమతో శ్వాస వదిలి వెయ్యాలి. 5-5 సెకన్ల నిష్పత్తిలో మొదటిరోజు 5నిమిషాలు ఒక నెల వచ్చేనాటికి 20 నిమిషాలు చేయండి. ఈ ఆసనం నిత్యం చేస్తే మంచి ఫలితాలను పొందగలరు.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ముద్దుగానే ముద్ద
 'చారిత్రికంతో మల్లాది వసుంధర..
 'స్త్రీ శక్తి మహెజబీన్‌
 మనదే మరోలోకం
 మనలో మనం దిశగా
 ముందంతా మహిళా ప్రపంచమే
 అబ్బాయిలు బిడియపడితే
 ఇది మహిళా వికాస తరుణంthis time for ladies
 అతివలకు అందివస్తున్న అవకాశాలూ,..
 ఆస్కార్ విజేతగా అవతరించిన..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com