మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 7:54 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
స్త్రీధనానికి భద్రత అవసరం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:09 [IST]

dipikapadukoneపెళ్లి సమయంలో అమ్మాయికి స్త్రీ ధనంగా నగదునో, వస్తువులనో, నగలనో ఇవ్వడం భారతీయుల సాంప్రదాయంగా వస్తోంది. అత్త వారింట్లో అమ్మాయికి ఎలాంటి కష్టం కలిగినా ఇవి ఆర్థికంగా ఆమెకు చేయూతనిచ్చి,  జీవితం సాఫీగా సాగేందుకు అక్కరకు వస్తాయని పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టి ఉండవచ్చు. కానీ నేడు ఎంత మంది స్త్రీలు తమ స్త్రీ ధనాన్ని వినియోగిం చుకోగలుగుతున్నారు.

కనీసం కాపాడుకోగలు గుతున్నారు. అత్తవారింట్లో అడుగుపెట్టిన మరుక్షణం ఆమెకు బహుమతిగా లభించిన స్త్రీధనం దక్కకుండా పోతోంది.
స్త్రీధనాన్ని రక్షించుకోవడానికి ప్రతి యువతీ ముందు వివరాలను లేఖాబద్ధం కోవడమేకాక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 ముందుగా స్వంత పేరుమీద బ్యాంక్‌లో లాకర్‌ను తీసుకోవాలి.
పెళ్లిసమయంలో మీకు లభించిన నగలు లేక నగదు ఇతరపత్రాలను బ్యాంక్‌ లాకర్‌లో భద్ర పరుచుకోవాలి.

వివాహ సమయంలో అంతకు మునుపు మీకు అందజేసి వస్తువులు,నగలు ఇతర పత్రాలు మొదలైన వాటి జాబితాను తయారు చేసుకోవాలి.
ఈ జాబితా కాపీని ఒకటి లాకర్‌లోనూ మరొకటి మీ దగ్గర ఉంచుకోవాలి.
పెళ్లి సందర్భంలో వివిధ కార్యక్రమాలకై అమ్మా యికి లభించిన బహుమతుల వివరాలను రాసి ఉంచుకోవడమే కాక వాటి ప్రూఫ్‌లను కూడా దగ్గరుంచుకోవాలి. ఉదాహరణకు చదివింపుల సమయంలో అమ్మాయికి వస్తువులను ఇస్తున్న ఫొటోలు, వీడీయో సిడీలను జాగ్రత్తగా ఉంచాలి.

కట్నకానుకలుగా అమ్మాయికి ఇచ్చే వస్తువులను కొనేటప్పుడు వాటి బిల్లులను పెళ్లికూతురి పేరుమీదనే తీసుకోవాలి.
ఆ బిల్లులను పెళ్లి తరువాత కూడా భద్ర పరుచుకోవాలి.
అప్పగింతల సమయంలో అమ్మాయిని సాగనంపే ముందు ఇచ్చే వస్తువులన్నింటి జాబితా రాసి ఒక కాపీ వరుడి తరుఫు వారికి అందించి మరోటి దగ్గరుంచుకోవాలి.

వధువు తరుఫునుండి వరుడికి అందించే నగదు, ఇతర వస్తువులను  ఖచ్చితంగా పెద్దల సమ క్షంలో ఇవ్వండి. చాటుగా ఏదీ ఇవ్వడం సరి కాదు. భవిష్యత్తులో మీరిచ్చిన రొఖం లేదా వస్తువుల గురించి మాట్లాడాలంటే ఏదైనా ప్రూఫ్‌ తప్పనిసరి అవుతుందని గుర్తుంచుకోండి.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 లోపిస్తున్న దాంపత్య విలువలు
 మిథునరాశి
 ప్రవాసాంధ్ర సాహితీ పరిమళం
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com